తెలుగులో మిడిల్ రేంజ్ హీరోగా సక్సెస్ ఫెయిల్యూర్ కు అతీతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న నటులలో గోపీచంద్ కూడా ఒకరు.ప్రముఖ నటుడు మాదాల రవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేకింగ్ విషయంలో తనకు కాన్ఫిడెన్స్ ఉంటుందని చిన్న సినిమా థియేటర్లకు వెళితే ఎంత రెవిన్యూ వస్తుందో చెప్పలేమని మాదాల రవి అన్నారు.
ఓటీటీలో కూడా పెద్ద సినిమాలకే డిమాండ్ ఉందని తెలిపారు.
ఓటీటీలలో చిన్న సినిమాలను ఎవరూ పట్టించుకోవడం లేదని మాదాల రవి అన్నారు.
తను నటించిన సినిమాలలో వీరగాథ మాత్రం షూటింగ్ సమయంలో ఆగిపోయిందని మాదాల రవి అన్నారు.తెలంగాణ సాయుధ పోరాటం గురించి అద్భుతమైన కథతో తెరకెక్కాల్సిన ఆ సినిమా నిర్మాతకు ఆర్థిక సమస్యలు రావడంతో ఆగిపోయిందని మాదాల రవి తెలిపారు.
హీరో గోపీచంద్ నాన్న, మా నాన్న కలిసే పెరిగారని మాదాల రవి వెల్లడించారు.
వాళ్లిద్దరూ ఆత్మ బంధువులలా కలిసే ఉండేవాళ్లని మాదాల రవి పేర్కొన్నారు.

గోపీచంద్ వాళ్ల అన్న ప్రేమ్ చంద్ అని జీవించి ఉంటే పెద్ద డైరెక్టర్ అయ్యేవారని మాదాల రవి చెప్పుకొచ్చారు.అమ్మాయి కాపురం సినిమా షూటింగ్ సమయంలో సోడా బండి రాలేదని కారులో వెళుతూ ప్రమాదంలో ప్రేమ్ చంద్ మృతి చెందారని మాదాల రవి అన్నారు.తన పూర్తి పేరు మాదాల రవి చంద్ అని పేరు పెద్దగా ఉందని మీడియా వాళ్లు చెప్పడంతో మాదాల రవిగా పాపులర్ అయ్యానని ఆయన అన్నారు.

ఇండస్ట్రీలో చాలామందికి తాను ఫ్యామిలీ డాక్టర్ లా ఉన్నానని మాదాల రవి తెలిపారు.తాను, రాజశేఖర్ మంచి స్నేహితులమని మాదాల రవి వెల్లడించారు.సోషల్ యాక్టివిస్ట్ గా ఏ సమస్య వచ్చినా సమస్య జెన్యూన్ అయితే ముందుకు వెళతానని మాదాల రవి పేర్కొన్నారు.