ఆ దర్శకుడి మాటలకు కోటా కంటతడి ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని నటుడిగా ఎదిగిన వ్యక్తి కోటా శ్రీనివాస రావు.బ్యాంకు ఉద్యోగిగా పని చేసిన ఆయనకు.

చిన్ననాటి నుంచే నాటకాలంటే చాలా ఇష్టం.నాటకాల్లో చక్కటి నటనతో జనాలను విపరీతంగా ఆకట్టుకునే వాడు.

ఆ అలవాటే ఆయనను సినిమాల్లోకి వచ్చేలా చేసింది.కెరీర్ తొలినాళ్లలో కాస్త ఇబ్బంది పడ్డా.

ఆ తర్వాత ఎదురు లేకుండా ముందుకు సాగాడు.ప్రతిఘటన సినిమా తర్వాత తన కెరీర్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు.

Advertisement

ఈ సినిమా తర్వాత కోటా శ్రీనివాసరావు తిరుగులేని నటుడిగా మారిపోయాడు.ఈ సినిమాను ఉషాకిరణ మూవీస్ బ్యానర్ మీద రామోజీరావు నిర్మించాడు.

ఇందులో కోటా నటనకు ఆయన ఫిదా అయ్యాడు.ఈయన నాలుగు కాలాల పాటు సినిమాలో నిలదొక్కుకునే అవకాశం ఉందని ఆయన భావించాడు.

అందుకే ఆయనకు తన తర్వాతి సినిమా మల్లెమొగ్గలు సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.మధుసూధనరావు ఈ సినిమాకు దర్శకుడు.

ఈయన అంటే సినిమా నటులకు చాలా భయంతో కూడిన భక్తి.ఎందుకంటే తను చాలా సీనియర్ దర్శకుడు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

ఈ సినిమాలో కోటాకు ఓ క్యారెక్టర్ ఇచ్చారు.రాజమండ్రిలో షూటింగ్.

Advertisement

ఓ నాలుగు రోజుల పాటు తన క్యారెక్టర్ సీన్లు చేశాడు కూడా.ఓ రోజు అనుకోకుండా ఓ పావుగంట లొకేషన్ కు ఆలస్యంగా వెళ్లాడు.

ఆయన వెళ్లే సరికి దర్శకుడు ఒంటిరిగా అక్కడ కూర్చుని ఎదురుచూస్తున్నాడు.

వెంటనే అక్కడికి వెళ్లిన కోటా.నమస్కారం చేశాడు.దర్శకుడు ఏమంటాడో అనే బెంగగా ఉన్నాడు.

రండి.మీరు పెద్దవాళ్లు.

అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు.మీరు ఎప్పుడు వస్తే అప్పుడే షూటింగ్ మొదలు పెడదాం.

అంతా మీ దయ అంటూ మరింత వ్యంగ్యాన్ని జోడించాడు.ఏం చెయ్యలో కోటాకు అర్థం కాలేదు.

అంతకు ముందు తను ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు.అక్కడే ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ బాపినీడును పిలిచి.

వీడికి పెట్టిన విగ్గు తీసేసి.ఇక్కడి నుంచి పంపించెయ్ అన్నాడు.

కోటా కంటతడి పెట్టుకున్నాడు.మళ్లీ ఇలాంటి ఘటన రిపీట్ కాదని ప్రాధేయపడ్డా నో అని చెప్పాడు దర్శకుడు.

ముందు ఆ ఏడుపు ఆపాలన్నాడు.ఆయన గొంతులో గద్దాయింపు కనిపించింది.కాసేపయ్యాక.

ఇటు రమ్మని పిలిచాడు.దగ్గరికి పిలుచుకుని రాత్రే నువ్వు నటించిన ప్రతిఘటన సినిమా చూశాను.

అద్భుతంగా నటించావు.మున్ముందు నువ్వు అద్భుతమైన నటుడివి అవుతావు.

అందుకే ఈ సినిమాలో ఈ చిన్నపాత్ర వద్దు అని చెప్పాడు.నీకు తగిన వేషం ఉన్నప్పుడు తప్పకుండా కబురు పెడతానని చెప్పాడు.

ఆయన చెప్పినందుకు సంతోషపడాలో.సినిమాలో క్యారెక్టర్ ఇవ్వనందకు బాధపడాలో తనకు అర్థం కాలేదు.

తాజా వార్తలు