Charan Raj: షూట్ రూమ్ లో ఆ ఫోటో ఉంటేనే ఇంటర్వ్యూ కి ఒప్పుకుంటాను అంటున్న నటుడు

చరణ్ రాజ్.

( Charan Raj ) ఇప్పుడు కాస్త తక్కువే తెలుగు సినిమాల్లో కనిపిస్తున్న ఈ నటుడు 80, 90 లలో మాత్రం చాల బిజీ గా విలన్ పాత్రల్లో, సహాయక నటుడిగా కనిపించేవారు.

చరణ్ రాజ్ తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళం సినిమాల్లో ఎక్కువగా నటించాడు.అయితే తాను తొలిసారి నటించింది మాత్రం ఒక కన్నడ సినిమాలోనే.

ఇక తెలుగు లో మాత్రం ప్రతి ఘటన చిత్రం తో( Pratighatana ) పరిచయం కాగా ఈ సినిమా చాల పెద్ద విజయాన్ని అందుకుంది.ఆ తర్వాత చరణ్ రాజ్ చాల తెలుగు సినిమాల్లో కనిపించాడు.

కెరీర్ మొత్తం మీద 200 కు పైగా సినిమాల్లో నటించిన చరణ్ రచయితగా, దర్శకుడిగా మరియు నిర్మాతగా మారి కూడా తానేంటో నిరూపించుకున్నాడు.

Advertisement

చాల మంది నటులకు చరణ్ రాజ్ కి కాస్త వ్వత్యాసం ఉంటుంది.ఒక్కసారి ఓన్ చేసుకుంటే జీవితాంతం అదే భావన తో ఉండే ఎమోషనల్ పర్సన్ గా చరణ్ రాజ్ ని అందరు చెప్తూ ఉంటారు.ఇక చరణ్ రాజ్ ఒకసారి పొరపాటుగా గుడిలోకి గన్ను తో వెళ్లి కాంట్రవర్సీ కి గురయ్యాడు.

పరాజిత అనే సినిమాలో హీరో గా నటించడానికి ముందు సినిమా ఇండస్ట్రీ లోకి రావాలనే ఉద్దేశం తో బెంగుళూరు కి మకాం మార్చి బ్రతకడం కోసం రాత్రి పూట హోటల్స్ లో పాటలు పాడుతూ ఉండేవాడు.

కర్ణాటకలోని ఒక మారు మూల పల్లెటూర్లో పుట్టిన చరణ్ సినిమాల్లోకి రావాలి అనుకుంటే ఒక స్నేహితుడు నువ్వు సినిమాలకు పనికి రావు అని ఎగతాళి చేయడం తో అప్పటి వరకు రైస్ మిల్ వ్యాపారం కోసం దాచుకున్న డబ్బు తో ఇంట్లో నుంచి బయటకు వచ్చి సినిమా అవకాశాల కోసం పగలంతా ఆఫీసుల చుట్టూ తిరగడం, రాత్రి అయితే పాటలు పాడటం చేసి మొత్తానికి పరాజిత చిత్రంలో( Parajita Movie ) అవకాశం కొట్టేసాడు.ఆ సినిమా వంద రోజులు ఆడింది.ఇక ఆ సినిమా డైరెక్టర్ S సిద్ధలింగయ్య గారు అంటే చరణ్ రాజ్ కి ప్రత్యేకమైన గౌరవం.

తెలుగు లో ప్రతి ఘటన ద్వారా పరిచయం చేసిన టి కృష్ణ మరియు S సిద్ధలింగయ్య గారి ఫోటోలను ఆయన దేవుళ్లుగా పూజిస్తారు.అంతే కాదు ఏ ఇంటర్వ్యూ ఇచ్చిన కూడా ఆ రూమ్ లో ఈ ఇద్దరు ఫోటోలు ఉంటేనే ఒప్పుకుంటారు .

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు