సినిమా హీరోలతో సమానంగా గుర్తింపును సొంతం చేసుకున్న అతికొద్ది మంది నటులలో చలపతిరావు కూడా ఒకరు.అయితే కైకాల సత్యనారాయణ మరణం చలపతిరావును ఎంతో బాధ పెట్టిందని సమాచారం.
చలపతిరావు ట్విట్టర్ లో ఉన్నారనే సంగతి ఆయన అభిమానులలో చాలామందికి తెలియదు.సత్యనారాయణ మరణ వార్త తెలిసిన వెంటనే చలపతిరావు ట్విట్టర్ లో “నువ్వు కూడా వెళ్లిపోయావా సత్యన్నా” అంటూ ట్వీట్ చేశారు.
ట్విట్టర్ లో ఆయనకు 8087 మంది ఫాలోవర్లు ఉన్నారు.గతంలో ఒక ఇంటర్వ్యూలో చలపతిరావు మాట్లాడుతూ ఒకరోజు ఒక వ్యక్తి మా ఇంటికొచ్చి తన కూతురిని వదిలేసి వెళ్లిపోతానని చెప్పగా నేను వద్దు బాబూ అని దండం పెట్టానని ఆయన కామెంట్లు చేశారు.
కొంతమంది ఆర్టిస్టులు సైతం పెళ్లి చేసుకోవాలని సూచనలు చేశారని చలపతిరావు చెప్పుకొచ్చారు.నేను మాత్రం రెండో పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని పెంచి పెద్ద చేయాలని మెంటల్ గా ఫిక్స్ అయ్యానని ఆయన పేర్కొన్నారు.
నా పిల్లలను బాగా చదివించాలనుకున్నానని నా పిల్లలను చూడటానికి మా అమ్మను రమ్మన్నానని ఆయన కామెంట్లు చేశారు.ఒకానొక సమయంలో నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని ఆ సమయంలో నేను డిప్రెషన్ లో ఉండిపోయానని చలపతిరావు పేర్కొన్నారు.
ఆ సమయంలో సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని ఆయన వెల్లడించారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఆ ఆలోచన విషయంలో వెనక్కు తగ్గానని చలపతిరావు పేర్కొన్నారు.

లక్ష రూపాయలు తీసుకుని మద్రాస్ కు వెళ్లానని అయితే మద్రాస్ నుంచి తిరిగి వచ్చే సమయంలో బస్ ఎక్కడానికి లక్ష రూపాయలు కూడా లేవని ఆయన అన్నారు.ఆ సమయంలో పిల్లల్ని ఏ విధంగా చదివించాలో కూడా అర్థం కాలేదని చలపతిరావు చెప్పుకొచ్చారు.ఆ తర్వాత మళ్లీ సినిమా ఆఫర్లను సంపాదించి నటుడిగా బిజీ అయ్యానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.







