యంగ్ హీరో నిఖిల్, క్రేజీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 18 పేజెస్ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమా ను నిర్మించాడు.
సూర్య ప్రతాప్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా గత శుక్ర వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.అయితే ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఈ సినిమా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ను సొంతం చేస్తుందని.అన్ని ఏరియాల్లో కూడా భారీ వసూళ్లు నమోదు చేయడం ద్వారా మొదటి రోజు నుండే లాభాల బాట పట్టిందంటూ ప్రకటించేశారు.

చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ సెలబ్రేషన్ పేరుతో విడుదల చేసిన పోస్టర్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమా అంటూ 18 పేజెస్ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించేశారు.ఈ మధ్య కాలం లో ఏ ఒక్క సినిమా కూడా మొదటి రోజు బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమానే లేదు.కానీ ఈ సినిమా మాత్రం సాధించేసింది అంటూ వారు ప్రకటించిన విధానం చూస్తుంటే ఇండస్ట్రీ వర్గాల వారికి మరియు మీడియా సర్కిల్స్ వారికి ఆశ్చర్యంగా ఉంది.
జనాలు మాత్రం సినిమాను ఆదరిస్తున్నట్లుగా కనిపిస్తుంది.ఎంత ఆదరించినా ఒక్క రోజులోనే కలెక్షన్స్ మొత్తం రావడం అనేది సాధ్యం కాదు అని చాలా మంది భావిస్తున్నారు.నిజంగానే అలా వస్తే ఒక అద్భుతం అన్నట్లే.సినిమా ఇప్పటికే లాభాల బాట పట్టినట్లయితే రెండవ రోజు నుండే చిత్ర యూనిట్ సభ్యులు భారీ మొత్తంలో లాభాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు.
అదే నిజమైతే ఈ సినిమా ఈ ఏడాది మేటి చిత్రాల్లో ఒకటిగా నిలవడం ఖాయం.అల్లు అరవింద్, బన్నీ వాసు కాంబినేషన్ లో ఇది మరో విజయంగా చెప్పుకోవచ్చు.
ఈ సినిమా కు సుకుమార్ రచయితగా వ్యవహరిస్తూనే సహ నిర్మాతగా వ్యవహరించాడు.







