టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు బాలాదిత్యకు( baladitya ) మంచి గుర్తింపు ఉంది.పరిమితంగా సినిమాలలో నటిస్తున్నా మంచి పాత్రలను ఎంచుకోవడం ద్వారా బాలాదిత్య సత్తా చాటుతున్నారు.
నాకు ఏ విషయంలో అయినా కుటుంబం నుంచి సపోర్ట్ ఉంటుందని ఆయన తెలిపారు.నేను సినిమాలపై దృష్టి పెట్టాలని అనుకున్న సమయంలో ఉదయ్ కిరణ్, తరుణ్, జూనియర్ ఎన్టీఆర్( Uday Kiran, Tarun, Jr.NTR ) టీనేజర్ సినిమాలతో వరుస విజయాలతో ఉన్నారని ఆయన తెలిపారు.
ఆ సమయంలో సినిమాలపై దృష్టి పెట్టానని బాలాదిత్య పేర్కొన్నారు.2009లో ఎడ్యుకేషన్ కోసం బ్రేక్ తీసుకున్నానని ఆయన అన్నారు.మా కజిన్ సూచనల మేరకు లా చేయడంతో పాటు సీఏ చేశానని బాలాదిత్య వెల్లడించారు.
నేను మూడేళ్లలో సీఏ పూర్తి చేశానని ఆయన అన్నారు.హీరోగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత మళ్లీ బుక్స్ పట్టుకుని చదవడం కష్టమని బాలాదిత్య వెల్లడించడం గమనార్హం.
![Telugu Baladityantr, Baladitya, Elur, Suhasini, Tollywood, Uday Kiran-Movie Telugu Baladityantr, Baladitya, Elur, Suhasini, Tollywood, Uday Kiran-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/actor-baladitya-comments-about-ntr-and-uday-kiran-details-hereb.jpg)
ఆ తర్వాత సినిమా ఆఫర్లు రాకపోవడంతో టీచింగ్ పై దృష్టి పెట్టానని బాలాదిత్య పేర్కొన్నారు.కెరీర్ విషయంలో నాకు ఫ్రీడమ్ ఉందని బాలాదిత్య అన్నారు.ఏలూరు( Elur ) నా స్వస్థలం అని ఆయన కామెంట్లు చేశారు.అన్నయ్య ఇండస్ట్రీకి మొదట వచ్చాడని ఆ తర్వాత నేను వచ్చానని బాలాదిత్య పేర్కొన్నారు.మా అన్నయ్యకు తోడుగా వెళ్లడం ద్వారా నాకు ఆఫర్ వచ్చిందని ఆయన అన్నారు.
![Telugu Baladityantr, Baladitya, Elur, Suhasini, Tollywood, Uday Kiran-Movie Telugu Baladityantr, Baladitya, Elur, Suhasini, Tollywood, Uday Kiran-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/actor-baladitya-comments-about-ntr-and-uday-kiran-details-herec.jpg)
నాన్నకు సినీ రంగంపై ఉండే ఇష్టం వల్ల నాకు ఆఫర్లు వచ్చాయని బాలాదిత్య చెప్పుకొచ్చారు. సుహాసినితో( Suhasini ) మంచి స్నేహం ఉందని ఇప్పటికీ ఆ స్నేహం కొనసాగుతుందని ఆయన తెలిపారు.మా ఫ్యామిలీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని బాలాదిత్య పేర్కొన్నారు.
తక్కువ సమయంలో రెండు సినిమాల్లో కలిసి నటించడం వల్ల ఆ వార్తలు ప్రచారంలోకి వచ్చాయని బాలాదిత్య కామెంట్లు చేశారు.బాలాదిత్య చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.