టాలీవుడ్ హీరో గోపీచంద్( Hero Gopichand ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటూ తీసుకుపోతున్నారు గోపీచంద్.
సరైన సక్సెస్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు గోపీచంద్.ఇకపోతే గోపీచంద్ ప్రస్తుతం శ్రీను వైట్ల డైరెక్షన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
కాగా శ్రీను వైట్ల( Srinu Vaitla ) మూవీస్ అనగానే అందరికీ కామెడీ గుర్తుకు వస్తుంది.ఆయన తీసిన సినిమాల్లో ప్రేమ, కామెడీ సన్నివేశాలు ఎంతో సహజంగా ఉంటాయి.
![Telugu Gopichand, Gopichandsreenu, Sreenu Vaitla, Tg Viswa Prasad, Viswam Strike Telugu Gopichand, Gopichandsreenu, Sreenu Vaitla, Tg Viswa Prasad, Viswam Strike](https://telugustop.com/wp-content/uploads/2024/04/Gopichand-Sreenu-Vaitla-Viswam-movie-First-Strike.jpg)
ఇక గోపీచంద్ అంటే అందరికీ మాస్ యాక్షన్ గుర్తుకు వస్తుంది.అలాంటి ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఎలా ఉంటుందా? అని అంతా అనుకున్నారు.గోపీచంద్ మూవీ టైటిల్స్ లో ఉండే సెంటిమెంట్( Sentiment ) అందరికీ తెలిసిందే.రణం, శంఖం, శౌర్యం, లక్ష్యం, లౌఖ్యం అంటూ ఇలా ఒక రైమింగ్ లో ఉంటాయి.
అయితే ఇప్పుడు అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ గోపీచంద్, శ్రీను వైట్ల కాంబోలో రాబోతోన్న ఈ మూవీకి విశ్వం( Viswam ) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ స్ట్రైక్‌ను రిలీజ్ చేశారు.
ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియో బ్యానర్ మీద వేణు దొనేపూడి నిర్మించారు.
![Telugu Gopichand, Gopichandsreenu, Sreenu Vaitla, Tg Viswa Prasad, Viswam Strike Telugu Gopichand, Gopichandsreenu, Sreenu Vaitla, Tg Viswa Prasad, Viswam Strike](https://telugustop.com/wp-content/uploads/2024/04/Gopichand-Sreenu-Vaitla-TG-Viswa-Prasad-Viswam-First-Strike.jpg)
రీసెంట్‌గానే ఈ మూవీలోకి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ( Peoples Media Factory ) ప్రవేశించింది.టీజీ విశ్వ ప్రసాద్ రాకతో ప్రాజెక్ట్ మీద మరింతగా అంచనాలు పెరిగాయి.వేణు దొనెపూడి, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఫస్ట్ స్ట్రైక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
కాగా తాజాగా విడుదల చేసిన ఫస్ట్ స్ట్రైక్( Viswam Movie First Strike )లో గోపీచంద్ చాలా కొత్తగా కనిపించాడు.ఇక పెళ్లిలో గన్నుతో గోపీచంద్ విధ్వంసం చేశాడు.
అక్కడ వండిన బిర్యానీని తింటూ ప్రతీ మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది.దీనిపై నా పేరు రాసి ఉంది అంటూ అంటూ హిందీలో చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.
ఎంతో పవర్ఫుల్ తో చెప్పిన ఈ డైలాగు సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.