ప్రముఖ భారతీయ సినీ నటులలో అమితాబ్ బచ్చన్ ఒకరనే సంగతి తెలిసిందే.తన సినీ కెరీర్ లో అమితాబ్ 180కు పైగా సినిమాలలో నటించారు.
నటుడిగా అమితాబ్ జాతీయ అవార్డులతో పాటు అంతర్జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.తన సినీ కెరీర్ లో అమితాబ్ 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులను సాధించారు.
ఉత్తమ నటుడిగా అమితాబ్ బచ్చన్ 40సార్లు నామినేట్ అయ్యారు.కేంద్రం అమితాబ్ ను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ లతో గౌరవించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ లో అమితాబ్ బచ్చన్ జన్మించారు.తల్లి తేజీ ప్రోత్సాహం వల్లే అమితాబ్ సినిమాలలోకి వచ్చారు.
అయితే రెండు దశాబ్దాల క్రితం తనకు ఎదురైన అనుభవాల గురించి అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చారు.ఒంటరిగా సినిమాల్లోకి వచ్చిన అమితాబ్ ఎంతోమందికి స్పూర్తిగా మారడంతో పాటు సినిమాలకే పనికిరాడని అన్నవాళ్లతో సూపర్ హీరో అని పిలిపించుకున్నాడు.
70 సంవత్సరాల వయస్సులో కూడా కౌన్ బనేగా కరోడ్ పతి షోతో అమితాబ్ సత్తా చాటుతున్నారు.అయితే ఈ షో చేయడానికి తాను ఎంతగానో ఆలోచించానని అమితాబ్ పేర్కొన్నారు.2000 సంవత్సరంలో కేబీసీ షో నిర్వాహకులు తనను అప్రోచ్ అయ్యారని ఆ సమయంలో తన దగ్గర డబ్బులు కూడా లేవని అమితాబ్ బచ్చన్ వెల్లడించారు.కేబీసీ షో ఆఫర్ వచ్చిన సమయంలో ఏం చేయాలో అనే దీన స్థితిలో తాను ఉన్నానని అమితాబ్ పేర్కొన్నారు.

ఆ సమయంలో తన చేతిలో డబ్బులు లేవని అవకాశాలు లేవని అమితాబ్ వెల్లడించారు.తాను దీనస్థితిలో ఉన్న సమయంలో ఈ అవకాశం వచ్చిందని అమితాబ్ పేర్కొన్నారు.బుల్లితెరపై కనిపిస్తే చులకనగా చూస్తారని స్థాయి తగ్గిపోతుందని భయపెట్టారని అమితాబ్ పేర్కొన్నారు.ఒక్క ఎపిసోడ్ తో మొదలుపెట్టిన ఈ షో వెయ్యి ఎపిసోడ్లు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించిందని అమితాబ్ అన్నారు.