ముంబైలో మరో నటుడు ఆత్మహత్య!

మూడు నెలల క్రితం బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ సూసైడ్ చేసుకొని మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఆ మృతి కేసు ఏ బాలీవుడ్ ని ఓ రేంజ్ లో అల్లాడిస్తుంటే ఇప్పుడు మరో నటుడు ముంబైలో సూసైడ్ చేసుకోవడం అందరికి షాక్ కి గురి చేస్తుంది.

ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజపుత్ కేసు కీలక మలుపులు తిరుగుతుంటే ఇప్పుడు మరో టీవీ నటుడు దారుణంగా ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు.ఈ టీవీ నటుడు ముంబైలో ఉన్న తన ప్లాట్ లో ఆత్మహత్య చేసుకొని మరించాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.బీహార్ కు చెందిన అక్షిత్ ఉత్కర్ష్ అనే 26 ఏళ్ల టీవీ నటుడు ముంబై లో తన ఫ్లాట్ లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే అతడు తన గర్ల్ ఫ్రెండ్ తో ఫ్లాట్ లో ఉంటున్నాడు.ఆదివారం రాత్రి ఉత్కర్ష్ విగతజీవిగా ఉండడం చూసిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది.

Advertisement

దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ ఆగిపోవడంతో అతడు మానసికంగా కుంగిపోయాడని అందుకే ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.

కానీ అతని తల్లితండ్రులు మాత్రం తమ కుమారుడుని చంపేసి ఆత్మహత్యల చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

మరి టీవీ నటుడుగా కొనసాగుతున్న ఉత్కర్ష్ షూటింగ్ ఆగిపోయి మానసికంగా దెబ్బ తినడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక నిజంగా అతని తల్లితండ్రులు అన్నట్టు ఎవరైనా హత్య చేసారా అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.ఏదిఏమైనా ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్యతో విలవిల్లాడుతున్న బాలీవుడ్ ఇప్పుడు ఈ నటుడు ఆత్మహత్యతో వణికిపోతుంది.

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!
Advertisement

తాజా వార్తలు