రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పిలుపునిచ్చారు.ఈరోజు నగరంలోని మౌర్య ఇన్ హోటల్, పరిణయ ఫంక్షన్ హాల్ నందు జరిగిన భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వేరే రాజకీయ పార్టీలతో పొత్తులు ఉంటాయా, లేదా అన్నది పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని అన్నారు.పొత్తులు ఉన్నా, లేకున్నా, లేక ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినా ఎటువంటి పరిస్థితుల నైనా ఎదుర్కొనే విధంగా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై అబాండాలు వేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీజీ పిలుపునిచ్చారు.కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ బిజెపి పార్టీ అధికారంలో ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందన్న విషయం ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని టీజీ వెంకటేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి చంద్రమౌళి చిరంజీవి రెడ్డి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.







