Minister Uttam Kumar Reddy : మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ తో పాటు బాధ్యులపై చర్యలు..: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం నాలుగు రోజుల పాటు పర్యటిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) అన్నారు.

మేడిగడ్డ బ్యారేజ్ పై నాలుగు నెలల్లో రిపోర్టు సమర్పిస్తామని ఎన్డీఎస్ఏ తెలిపిందని పేర్కొన్నారు.

ముందు వీలైనంత త్వరగా ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వాలని కోరామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాథమిక రిపోర్టు ఆధారంగా బ్యారేజ్ రిపేర్ తో పాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్( BRS ) కు ఏటీఎంగా మారడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు.కేంద్రం సహకారంతోనే కార్పొరేషన్ల ద్వారా రూ.84 వేల కోట్ల రుణం పొందారని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత బీజేపీకి లేదని వెల్లడించారు.

గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత

తాజా వార్తలు