హిందూపురంలో హత్యకు గురైన వైసీపీ నేత రామకృష్ఱా రెడ్డి హత్య కేసులో విచారణ వేగవంతం అయ్యింది.నిన్న రామకృష్ణారెడ్డిని కొందరు దుండగులు అతి కిరాతకంగా నరికి చంపిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో మృతుని అనుచరులు పోలీసుల సపోర్టుతోనే హత్య జరిగిందని ఆరోపణలు చేశారు.మృతుని తల్లి ఫిర్యాదు నేపథ్యంలో హిందూపురం రూరల్ సీఐ, ఎస్సైలపై అధికారులు వేటు వేశారు.
సీఐ జీటీ నాయుడు, ఎస్సై కరీంలకు వీఆర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది.







