ఉల్లి పంటను సాగు( Onion cultivation ) చేయాలనుకునే రైతులు ముందుగా ఆ పంటపై అవగాహన కల్పించుకోవాలి.అప్పుడే ఉల్లి పంటను( Onion crop )ఆశించే చీడపీడల, తెగుళ్ల నుంచి పంటను సంరక్షించుకోవచ్చు.
ఉల్లి పంటకు ఎలాంటి చీడపీడలు లేదా ఎలాంటి తెగుళ్లు ఆశించిన తీవ్ర నష్టమే.కాబట్టి ఉల్లిగడ్డ పంటను నాటినప్పటి నుంచి కోతల వరకు సరైన యాజమాన్య పద్ధతులను పాటించి సాగు చేయాల్సి ఉంటుంది.
ఉల్లి పంటకు ఆశించే తెగుళ్ల విషయానికి వస్తే ఆకు ఎండు తెగుళ్లు పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.ఈ తెగుళ్లకు గాలి ద్వారా వ్యాపిస్తాయి.
పొలంలో 10 నుండి 20 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం, ఎక్కువ సమయం ఆకులు తడిగా ఉండడం లేదా అధిక తేమ వాతావరణం శిలీంద్రబీజాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.

ఉల్లిగడ్డ మొక్క యొక్క ముదురు ఆకులపై ఈ తెగుల లక్షణాలు గమనించవచ్చు.మొక్క ఆకుపై చిన్న గుండ్రటి తెల్లటి మచ్చలు ఏర్పడి, లేత పచ్చ లేదా వెండిరంగు వలయాలు కనిపిస్తాయి.క్రమంగా ఈ మచ్చలు పెద్దవై మధ్యలో ఎండు గడ్డి రంగు గుంతలు ఏర్పడతాయి.
ఆ తర్వాత మొక్కలు ఎండిపోయి చనిపోతాయి.ఈ తెగులను సేంద్రీయ పద్ధతి( Organic method )లో నివారించడం కష్టం.
కాబట్టి పంటకు తెగులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.తెగులు నిరోధక, ఆరోగ్యకరమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.
త్వరగా పరిపక్వతకు వచ్చే విత్తనాలు అయితే మంచిది.మొక్కలకు గాలి మరియు సూర్యరశ్మి బాగా తగిలే విధంగా మొక్కల మధ్య దూరం ఉండేటట్లు నాటుకోవాలి.

ఉల్లి పంట నాటుకోవడానికి ముందే పొలంలో వివిధ రకాల పంటల అవశేషాలను పూర్తిగా తీసేయాలి.ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలి.ఈ ఆకు ఎండు తెగులను పొలంలో గమనిస్తే ముందుగా వాటిని పీకేసి కాల్చి నాశనం చేయాలి.ఆ తరువాత సైప్రోడినిల్ లేదా ఫ్లూడియోక్సనిల్( Fludioxanil ) లను పంటకు పిచికారి చేసి తొలి దశలోనే తెగులను నివారించాలి.
మాంకొజెబ్, క్లోరోతలోనిల్ లాంటి మందులను పైనుంచి చల్లే కన్నా మట్టిని శుభ్రపరచడానికి వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.