వేరుశనగ పంటకు తీవ్ర నష్టం కలిగించే కాండం కుళ్ళు తెగుల నివారణకు చర్యలు..!

వేరుశనగ( Groundnut ) అనేది నూనె గింజల పంటలో ప్రధానమైన పంట.

రబీ, వేసవిలో ఆరుతడి పంటగా నీటి సౌకర్యం ఉండే పొలాలలో అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతోంది.

ఈ వేరుశనగ పంటలో మంచి ఆదాయం ఉండడంతో పాటు చీడపీడల బెడద, తెగుళ్ల బెడద కాస్త ఎక్కువగానే ఉంటుంది.పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ సస్యరక్షక చర్యలు తీసుకోవడం వల్ల మంచి దిగుబడి సాధించి మంచి లాభాలు పొందవచ్చు.

రబీ లో వేరుశనగ పంటను సాగు చేస్తే.పంట పూత దశలో నుండి కాయలు ముదిరే దశ వరకు వివిధ రకాల చీడపీడలు ఆశించి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి.ఒకవేళ కాండం కుళ్ళు తెగుళ్లు పంటను ఆశిస్తే.

తొలి దశలోనే ఈ తెగుళ్లను అరికట్టడంలో విఫలం అయితే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సిందే.ఈ తెగులను పంట పొలంలో ఎలా గుర్తించాలంటే.

Advertisement

వేరుశనగ పంట విత్తిన 70 రోజుల తర్వాత ఈ తెగులు పంటను ఆశించే అవకాశం ఉంది.మొక్క యొక్క కాండం, ఊడలు మరియు కాయలకు ఈ తెగులు సోకుతుంది.

భూమి పైభాగాన ఉన్న కాండం మీద తెల్లటి బూజు తెరలుగా ఏర్పడి, ఆ తర్వాత ఆవగింజ పరిమాణంలో ఉన్న శిలింద్రసిద్ధ బీజాలు ఏర్పడతాయి.

వేసవిలో లోతు దుక్కులు( Summer ) దున్నుకొని, ఇతర పంటల అవశేషాలను నేల నుండి శుభ్రం చేయాలి.తెగులు నిరోధక ఆరోగ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.ఒక కిలో విత్తనాలను 1 గ్రామ్ కార్బండిజమ్( Carbendazim ) తో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

ఆ తర్వాత పంట పొలంలో విత్తుకోవాలి.కాండం కుళ్ళు తెగుళ్లు ఆశించిన తొలి దశలోనే తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి.ఆ తర్వాత 2.5 గ్రాముల మాంకోజెబ్ ను ఒక లీటర్ నీటిలో కలిపి నాజిల్ తో నేల తడిసేటట్లు పోయాలి.

వైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ ను పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీని ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు