మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలి: ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా: తుర్కపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి, కొనాపూర్, ఇబ్రహీపూర్, దత్తాయపల్లి, వేల్పుపల్లి గ్రామాల గుండా అక్రమంగా నడుస్తున్న మట్టి మాఫియాపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.అక్రమంగా ఓవర్ లోడ్లతో వెళుతున్న టిప్పర్ వాహనాలను గ్రామస్తులతో కలిసి గురువారం దత్తాయపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయం ఎదుట నిలుపుదల చేసి పోలీసులకు అప్పగించారు.

 Action Should Be Taken Against Soil Mafia Erukala Venkatesh Goud Demands, Soil-TeluguStop.com

ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి ఆయన మాట్లాడుతూ భారీ వాహనాలు అక్రమంగా మట్టి ఓవర్ లోడ్లతో వెళుతుండడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసం అవుతున్నట్లు తెలిపారు.

అదే విధంగా గ్రామంలోని ప్రజలకు మంచినీటిని అందించే నీటి పైపులు కూడా ఎక్కడికక్కడ పిగిలి నీరు రాక వారం రోజులు అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ దారి గుండా పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు టిప్పర్ వాహనాల ధాటికి భయాందోళనలకు గురవుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని,లేనిపక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈకార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి సభ్యులు గిద్దే కరుణాకర్, ఉపసర్పంచ్ గొప్ప సిద్ధారెడ్డి, వార్డు సభ్యులు జెర్రిపోతుల చంద్రయ్య, గ్రామస్థులు,యువకులు దానబోయిన మల్లేశం, జెర్రిపోతుల కరుణాకర్, నల్ల శ్రీరాములు,సత్తయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube