తెలంగాణలో కానిస్టేబుళ్ల నియామకాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పును వెలువరించింది.దీంతో 15,640 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి అడ్డంకి తొలిగింది.
గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది.ప్రశ్నాపత్రంలో నాలుగు ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులు డివిజన్ బెంచ్ లో సవాల్ చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రశ్నల తప్పిదాలపై స్వతంత్ర నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా మరో నాలుగు వారాల్లో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.







