లియో సెట్స్ లో అడుగుపెట్టిన యాక్షన్ కింగ్.. ఇక ఫుల్ యాక్షనే!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ (Thalapathy Vijay) ఒకరు.ఈయన ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తుంటాడు.

ఇక ఈ ఏడాది అప్పుడే వారిసు సినిమాతో ఫ్యాన్స్ ను అలరించాడు.ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విజయ్ వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేయడమే కాకుండా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.

విజయ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా లియో (Leo Movie).భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల బరిలో ఉంది.లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యాక్షన్ షెడ్యూల్ స్టార్ట్ చేసినట్టు టాక్.

Advertisement

మరి ఈ యాక్షన్ షెడ్యూల్ లో యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా (Arjun Sarja) ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఈ షెడ్యూల్ లో జరగనున్న యాక్షన్ ఎపిసోడ్స్ ను విజయ్, అర్జున్ మీదనే తెరకెక్కించ బోతున్నట్టు తెలుస్తుంది.మరి ఈ షెడ్యూల్ కొన్ని రోజుల పాటు కీలక సన్నివేశాలతో జరగనుందట.

చూడాలి లోకేష్ విక్రమ్ కు మించిన హిట్ తన ఖాతాలో వేసుకుంటాడో లేదో ఇక ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

త్రిష( Trisha ) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.అలాగే సంజయ్ దత్ విలన్ రోల్ ప్లే చెయ్యనున్నారు.లోకనాయకుడు కమల్ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నట్టు తెలుస్తుంది.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు