గత కొంత కాలంగా సైలెంట్ గా ఉంటూ వస్తున్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, మళ్లీ ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ లో ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకున్న ఆ విషయాలపై అచ్చెన్న సైలెంట్ గానే ఉన్నారు.
టీడీపీలో బోండా ఉమా, దేవినేని ఉమ, వర్ల రామయ్య, ఇలా కొంత మంది ఈ మధ్య కాలంలో హైలెట్ అవుతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా అనేక సమస్యలపై అచ్చెన్న వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అనేక సవాళ్లు విసిరారు.
పేదలకు దక్కాల్సిన ఇళ్లను కూడా వైసీపీ నేతలు అవినీతికి ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శించారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ ప్రభుత్వ హయాంలో 3.16 లక్షల ఇళ్లు కట్టి 2.62 లక్షల ఇళ్లు ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉంచింది అని అచ్చెన్న నాయుడు పేర్కొన్నారు.ప్రతి ఇంటికి ఐదు లక్షలు ఇచ్చి పేదలకు ఏటా 5 లక్షల ఇళ్లు కడతానని జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని , గత మూడేళ్ళలో 15 లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉండగా , జగన్ కేవలం ఐదు ఇళ్లు మాత్రమే నిర్మించారని ఆయన విమర్శించారు.
సెంటు భూమి పథకంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఐదువేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అనేక చోట్ల నివాస యోగ్యం కాని చోట్ల సెంటు భూమి పట్టాలు ఇచ్చారని మండి పడ్డారు.పేదలు ఇళ్లు కట్టుకో లేని విధంగా ఇసుక సిమెంట్ ధరలు విపరీతంగా పెంచారు అని ధైర్యం ఉంటే గృహ నిర్మాణం పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని అచ్చెన్న సవాల్ విసిరారు.వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే కక్షగట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అచ్చెన్న సవాల్ కు వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.