టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఒకటి.ఈ సినిమా కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమాకు సంబంధించి జనవరి 26న ఓ అప్‌డేట్ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇప్పటివరకు హీరోల పాత్రలకు సంబంధించిన టీజర్లను ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఇద్దరు హీరోలు ఒకే టీజర్‌లో కనిపించేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట.ఇక జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా ఈ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతోంది.
కాగా అదే రోజున మరో స్టార్ హీరో చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
కాగా ఈ సినిమాలో చిరంజీవి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను జనవరి 26న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.దీంతో జనవరి 26న ఈ రెండు చిత్రాల టీజర్లు రిలీజ్ అవుతుండటంతో ఈ రెండు టీజర్లలో ఏది ఎక్కువ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఏదేమైనా రెండు భారీ బడ్జెట్ చిత్రాల టీజర్లు ఒకేరోజున వస్తుండటంతో ఆ రోజు యూట్యూబ్‌ను దడదడలాడించేందుకు ఆయా హీరోల ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.