ఆర్ఆర్ఆర్ దెబ్బకు ఆలోచనలో పడ్డ ఆచార్య  

Acharya Title Poster Delayed Due To Rrr - Telugu Acharya, Chiranjeevi, Rajamouli, Rrr, Telugu Movie News

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది.అయితే కారోనా వైరస్ ప్రభావంతో లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది.

 Acharya Title Poster Delayed Due To Rrr

కాగా ఈ సినిమా టైటిల్‌ను చిరంజీవి ఓ సినిమా ఈవెంట్‌లో అనుకోకుండా అనౌన్స్ చేయడంతో దర్శకుడు కొరటాల శివ చాలా ఫీల్ అయ్యాడు.

అయితే ఈ సినిమా టైటిల్ లోగోను లాంఛ్ చేసే విషయంలో మాత్రం పూర్తి బాధ్యత కొరటాలకే ఇచ్చాడట చిరు.

ఆర్ఆర్ఆర్ దెబ్బకు ఆలోచనలో పడ్డ ఆచార్య-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో ఉగాది కానుకగా ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేస్తారని చిత్ర వర్గాలు అనుకున్నాయి.కానీ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర టైటిల్ లోగోను రిలీజ్ చేయడంతో ఈ సమయంలో ఆచార్య టైటిల్‌ లోగోను రిలీజ్ చేస్తే అనుకున్న స్థాయిలో క్రేజ్ ఏర్పడదని కొరటాల భావించాడట.

దీంతో ఉగాదికి ఈ సినిమా నుండి ఎలాంటి ట్రీట్ రాలేదు.ఇక ఈ చిత్ర టైటిల్ లోగోతో పాటు ఫస్ట్ లుక్‌ను కూడా ప్రస్తుతం ఉన్న ఆర్ఆర్ఆర్ క్రేజ్ తగ్గాకే రిలీజ్ చేయాలని కొరటాల ఆలోచిస్తు్న్నాడు.

దీంతో ఆచార్య చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు