మెగాస్టార్ చిరంజీఎవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ ఆచార్య.సినిమాలో చిరంజీవితో పాటుగా రాం చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే.
చిరు, చరణ్ మల్టీస్టారర్ మూవీగా వస్తున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ అందించడం పక్కా అని తెలుస్తుంది.ఈమధ్యనే రిలీజైన ట్రైలర్ కూడా సినిమాపై మరింత అంచనాలు పెంచింది.
మ్యాటినీ మూవీస్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ ఫిక్స్ చేశారు.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అటెండ్ అవుతారని వార్తలు వచ్చాయి.
అయితే ఆచార్య ఈవెంట్ లో గెస్ట్ గా జగన్ బదులుగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తారని తెలుస్తుంది.మెగా హీరోలిద్దరు నటించిన ఈ మెగా మూవీకి పవర్ స్టార్ గెస్ట్ గా వస్తే ఆ లెక్క వేరేగా ఉంటుంది.
తప్పకుండా ఆచార్య మెగా ఈవెంట్ మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి పండుగ వాతావరణం తెస్తుందని చెప్పొచ్చు.ఈ ఈవెంట్ కి మెగా ఫ్యామిలీ హీరోలంతా కూడా అటెండ్ అవుతారని తెలుస్తుంది.







