కాకి తలపై తన్నితే అశుభమా? కాకి మన పై వాలితే తల స్నానం ఎందుకు చేయాలో తెలుసా?

According To Hindu Mythology What Happens If Crow Touches Human, Crow, Crow Touches, Head Bath, Hindu Tradition, Hindu Mythology, Touch Human, Beat On Head, Shaneeswara, Vehicle Crow, Sharp Nails, Unhealthy, Unfortune, Bad Luck

సాధారణంగా మన భారతదేశంలో ప్రజలు ఎన్నో సాంప్రదాయ పద్ధతులను, ఆచారాలను పాటించడమే కాకుండా ఎన్నో నమ్మకాలను కూడా పెద్ద ఎత్తున విశ్వసిస్తుంటారు.ఈ విధమైనటువంటి కొన్ని నమ్మకాలు ప్రజల్లో బలంగా నాటుకుపోయి మూఢనమ్మకాలుగా కొనసాగుతూనే ఉన్నాయి.

 According To Hindu Mythology What Happens If Crow Touches Human, Crow, Crow Touc-TeluguStop.com

పూర్వకాలం మన పెద్దలు కొన్ని అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడం కోసం కొన్ని ఆచారాలను సృష్టించారు.అలాంటి వాటిలో ఒకటే కాకి తన్నితే అపశకునమనే ఓ నమ్మకం ప్రజల్లో ఉంది.

నిజంగానే కాకి తంతే అశుభమా? దీని వెనుక ఉన్న అర్థం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా కాకి తన్నితే ఆశుభం జరుగుతుందని, లేదా కాకి మనపై వాలితే మరణవార్త వింటారని, కాకి మన ఇంట్లో దూరితే శని వస్తుందని చెబుతుంటారు.మరికొందరు శనీశ్వరుడికి కాకి వాహనం కనుక, కాకి మన ఇంట్లో దూరితే సాక్షాత్తు శనీశ్వరుడు మన ఇంట్లోకి వచ్చాడని భావిస్తుంటారు.

ఈ క్రమంలోనే పెద్దఎత్తున పూజలను నిర్వహిస్తున్నారు.అయితే ఇవన్నీ కేవలం మనం పెట్టుకున్న నమ్మకాలేనని కొట్టిపారేస్తున్నారు.కాకి తలపై తన్నితే సైన్స్ ప్రకారం ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా కాకి కాలి వేళ్ల గోర్లు ఎంతో పదునుగా ఉంటాయి.

Telugu Bad Luck, Crow, Crow Touches, Bath, Hindu Mythology, Hindu, Shaneeswara,

కనుక కాకి వేగంగా ఎగురుతూ వచ్చి మనపై తన్నడం వల్ల మన చర్మం పై గుచ్చుకునే ప్రమాదం ఉంది కనుక కాకి తన్నకుండా జాగ్రత్త పడాలని ఉద్దేశంతోనే మన పెద్దవారు కాకి తంతే ఎంతో ప్రమాదమనే నమ్మకాన్ని సృష్టించారు.అదేవిధంగా కాకులు సహజంగా ఆహార అన్వేషణలో భాగంగా ఎలుకలను, చనిపోయిన జంతువులను కాలి గోళ్లతో పీక్కుతింటాయి.చనిపోయిన కుళ్ళిపోయిన విషపదార్థాలు కాకి కాలి గోళ్లకు అంటుకుని ఉంటాయి.ఈ క్రమంలోనే కుళ్ళిపోయిన వ్యర్థ పదార్థాలలో ఉండే క్రీములు మన పై పడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి కనుక, కాకి మనకు తగలగానే వెంటనే తలస్నానం చేయాలని మన పెద్దవారు తెలియజేస్తున్నారు.

కనుక కాకి తగలటం వల్ల ఎటువంటి అశుభాలు ఏర్పడని చెప్పవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube