ఏసీపీ దాడుల్లో బుక్కైన జేసీ దివాకరెడ్డి మాజీ పీఏ

సీనియర్ రాజకీయ నాయకుడిగా పేరు పొంది ముక్కుసూటిగా మాట్లాడుతూ రాజకీయ ప్రత్యర్థుల మీదే కాకుండా సొంత పార్టీ మీద కూడా విమర్శలు చేస్తూ ఎప్పుడు వార్తల్లో ఉండే మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

సురేష్ ఇంటిపై దాడులు చేసిన సమయంలో భారీగా ఆస్తులు బయట పడడం వైరల్ గా మారింది.

కొద్ది రోజుల క్రితమే జేసీకి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడి చేసి సీజ్ చేయడం,ఇది రాజకీయ కుట్ర అంటూ జేసీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన మా ఇంటి పై ఏసీబీ దాడులు జరగడం అనుమానాలకు తావిస్తోంది.ఇక ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగంపై అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్ల తదితర ప్రాంతాల్లో సురేష్ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి.

పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న సురేష్ రెడ్డి ని 2014 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా గెలిచిన తర్వాత తన పీఏగా నియమించుకున్నారు.అప్పట్లో జెసి అండతో ఈయన భారీగా ఆస్తులు కూడబెట్టారని ఏసీబీకి ఫిర్యాదు అందింది.

ఈ నేపథ్యంలోనే దాడులు చేసి మూడు కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు