ఆర్టికల్ 370 రద్దు చేయడంతో టెర్రరిజం తగ్గిందని ఆంటీ టెర్రరిజం ఫ్రంట్ చైర్మన్ మణిందర్‌జీత్ సింగ్ బిట్టా స్పష్టం చేసారు.ఇవాళ వేకువజాము సుప్రభాతం సేవలో పాల్గొన్న బిట్టా అనంతరం పద్మావతి అతిధిగృహంలో అతిధిగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
కేంద్రంలో మోడీ సర్కారు వచ్చాక టెర్రరిజం నియంత్రణలో ఉందని తెలిపారు.నేను రాజకీయంగా మాట్లాడలేదని ఆంధ్ర,తెలంగాణ విడిపోయాక బాగా అభవృద్ధి చెందాయన్నారు.
సిఎం జగన్ చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని చూసి దేశంలో మిగతా సిఎంలు నేర్చుకోవాలని కోరారు.ఆంధ్రకు విశాఖ రాజధాని అవ్వడం వల్ల మరింత అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలొస్తాయని అభిప్రాయపడ్డారు.
రెండు తెలుగు రాష్ట్రాలు కలిసుంటే బలమైన అభివృద్ది చెంది ఉంటుందన్నారు.రాజీవ్ గాంధీ,ఇందిరా గాంధీ లు ఉగ్రవాదుల చేతిలో చనిపోయారని చెప్పిన ఆయన, ఓట్ల కోసం ప్రభుత్వాలు టెర్రరిస్ట్ కార్యకలాపాలకు తగ్గద్దని హెచ్చరించారు.
తమిళనాడు ప్రభుత్వం దేశంతో కలిసి నడుస్తుందా లేదా ఎల్టిఈ వంతపాడుతుంద అనే అంశం స్పష్టం చేయాలనీ డిమాండ్ చేసారు. ఓట్లు రాకపోయినా టెర్రరిస్టులను వదిలేది లేదని స్పష్టం చేసారు.
సముద్ర తీర ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేయాలని, టర్కీ,నేపాల్ దేశాల్లో సంభవించిన భూకంపాలకు భారతదేశం సహాయం చేసిందన్నారు.రష్యా జరుపుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో పాకిస్తాన్ యువకుడు రక్షణ కోసం భారత త్రివర్ణ పతాకం పెట్టుకోవడం చాలా ఆనందదాయకమన్నారు.
పంజాబ్,పాకిస్తాన్ సరిహద్దుల్లో పట్టుబడే డ్రగ్స్ లింకులు ఎపి,తెలంగాణ లకు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసారు.







