ఆ కంటెస్టెంట్ నా చెల్లి.. అభిజిత్ సంచలన వ్యాఖ్యలు...

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్4 లో హారిక అభిజిత్ మధ్య లవ్ ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అభిజిత్, హారికల పేరెంట్స్ సైతం వాళ్లిద్దరికీ ఇష్టమైతే పెళ్లి చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.

అయితే తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో అభిజిత్ హారిక చెల్లి అంటూ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.బిగ్ బాస్ సీజన్ 4 టాప్ 5లో అభిజిత్, హారిక ఉండగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో హారిక మొదట ఎలిమినేట్ కాగా అభిజిత్ విన్నర్ అయ్యారు.

ఎలిమినేట్ అయిన సమయంలో హారిక బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లు అందరినీ బ్రదర్స్ అని పిలిచింది.తాజాగా అభిజిత్ ఇంటర్వ్యూల్లో నాకు ఒక తమ్ముడు ఉన్నాడని హారిక లాంటి సిస్టర్ కూడా ఉంటే బాగుండేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో తనలాంటి చెల్లి ఉంటే బాగుండేదని హారికకు ఎన్నోసార్లు చెప్పానని తెలిపారు.

Advertisement

అయితే బిగ్ బాస్ నిర్వాహకులు తాను హారికను చెల్లి అని పిలిచినట్లు ప్రసారం చేయకపోవడం వల్ల చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించారు.మొదట్లో మోనాల్ గజ్జర్ తో సన్నిహితంగా మెలిగిన అభిజిత్ ఆ తరువాత హారికతో క్లోజ్ గా ఉన్నారు.అయితే బిగ్ బాస్ టీం ఎపిసోడ్లలో అభిజిత్ హారికను లవర్స్ లా ప్రొజెక్ట్ చేయడంతో చాలామంది ప్రేక్షకులు వారిద్దరి మధ్య ఏదో ఉందని భావించారు.

హారికతో బాండింగ్ పై అభిజిత్ వివరణ ఇవ్వడంతో కొందరు నెటిజన్లు బిగ్ బాస్ లేనివి ఉన్నట్టు చూపించి ప్రేక్షకులను మోసం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.అన్నాచెల్లెళ్లను లవర్స్ లా చూపించడం సరికాదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు