నేను చనిపోయానని వార్తలు రాశారు.. వైరల్ అవుతున్న అబ్బాస్ సంచలన వ్యాఖ్యలు!

తెలుగు, తమిళ భాషల్లో ఒక వెలుగు వెలిగిన నటులలో అబ్బాస్( Hero Abbas ) ఒకరనే సంగతి తెలిసిందే.

అబ్బాస్ కు సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతుండగా అబ్బాస్ ను అభిమానించే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది.

అబ్బాస్ తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అబ్బాస్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

ఏవైనా రూమర్లు నాపై ఎందుకొచ్చాయా అని ఫీలయ్యారా అనే ప్రశ్నకు నేను చచ్చిపోయానని న్యూజిలాండ్ నుండి చెన్నైకు నా శవాన్ని తరలిస్తున్నారని వార్తలు రాశారని అబ్బాస్ తెలిపారు.

ఒక టైమ్ తర్వాత నాకు ఆటిట్యూడ్ ఉందని ఆయన అన్నారు.హార్పిక్ యాడ్( Harpic Ad ) గురించి నెగిటివ్ గా థింక్ చేయడం పబ్లిక్ మైండ్ సెట్ అని అబ్బాస్ కామెంట్లు చేశారు.నా ఫస్ట్ లవ్ సినిమా అని అబ్బాస్ వెల్లడించారు.

Advertisement

మంచి సినిమాలు చూస్తున్న సమయంలో మళ్లీ సినిమాల్లోకి వస్తే బాగుంటుందనే అభిప్రాయం కలుగుతుందని అబ్బాస్ పేర్కొన్నారు.నాకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్( Indian Air Force ) లో జాయిన్ కావాలనుకున్నా కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గాల్సి వచ్చిందని అబ్బాస్ వెల్లడించారు.ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కో విధంగా ఉంటాయని ఆయన తెలిపారు.

పబ్లిక్ ఫిగర్ అయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారని అబ్బాస్ పేర్కొన్నారు.జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్.ఆర్.ఆర్( RRR ) చూశానని ఆయన తెలిపారు.

సింపుల్, నైస్ పర్సన్, హార్డ్ వర్కింగ్ పర్సన్ అని ఎన్టీఆర్( NTR ) గురించి అబ్బాస్ చెప్పుకొచ్చారు.తారక్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని ఆయన తెలిపారు.చరణ్ జంజీర్ సినిమా( Zanjeer ) నేను చూశానని చరణ్ కథల ఎంపిక బాగుంటుందని అబ్బాస్ కామెంట్లు చేశారు.

లోకేష్ యూనివర్స్ కి రంగం సిద్ధం చేస్తున్న దర్శకుడు...మామూలుగా ఉండదు...
ఆ స్టార్ డైరెక్టర్ కథను సిద్ధు జొన్నలగడ్డ రిజెక్ట్ చేశారట.. అసలేం జరిగిందంటే?

అబ్బాస్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు