చిన్నా చితకా డిజాస్టర్ సినిమా అంటేనే భయపడతారు ప్రొడ్యూసర్ లు కానీ 14 రీల్స్ లో నేనొక్కడినే , ఆగడు అంటూ వరస సినిమాలు ప్లాప్ లు గా మిగలడం వారు జన్మలో మరచిపోలేని ఇబ్బంది గా మారింది.దాదాపు ఏడాది పాటు మళ్లీ సినిమా మొదలుపెట్టలేని పరిస్థితి తెచ్చిపెట్టాయి.
మళ్లీ సినిమా ఆరంభించినా.నాని హీరోగా లో బడ్జెట్ లో తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఐతేనేం ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’కు కావాల్సినంత క్రేజ్ అయితే వచ్చింది.చిన్న సినిమాతోనే ‘14 రీల్స్’ పేరు మళ్లీ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.
నిన్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను మహేష్ ముఖ్య అతిథిగా చాలా బాగా చేసింది 14 రీల్స్ సంస్థ.ఈ సంస్థ లో ఒకరైన అనీల్ ఏడాదిన్నర కిందట తెలిసో తెలియకో తప్పులు చేసాం అనీ మళ్ళీ మంచి సినిమాలు చెయ్యాలని అనుకుంటున్నాం అనీ అందరి సహకారం కావాలి అని ప్రకటించారు బహిరంగంగా.
హీరో నానీ తమకి అండగా నిలిచాడు అని కూడా ఆయన చెప్పుకొచ్చాడు.