సెల్ఫీ దిగుతూ నీటిలో కొట్టుకుపోయిన యువతి.. 12 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత?

ఈ మధ్యకాలంలో ఏ చోటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు ఫోటోలు తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది.

ఫోటోలు తీసుకొని వెంటనే అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమకు సంబంధించిన వివరాలను షేర్ చేస్తూ చాలా మంది యువత హాబీగా చేసుకున్నారు.

ఏ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్రంలోని( Karnataka ) తుంకూరు( Tumakuru )జిల్లాలోని మందరగిరి కొండల సమీపంలో ఉన్న సరస్సుపై రాళ్లతో కూడిన ప్రాంతంలో ఓ యువతి సెల్ఫీ తీసుకుంటూ బండరాళ్ల మధ్యలో చిక్కుకుపోయింది.

సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఓ యువతి అదుపుతప్పి నీటిలో పడిపోయింది.విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాయక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.12 గంటలు రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆమెను సిబ్బంది వారు సురక్షితంగా బయటకు తీశారు.గొబ్బి తాలూకా శివరాంపూర్ గ్రామానికి చెందిన బీటెక్ చదువుతున్న విద్యార్థిని 19 ఏళ్ల హంస మందరగిరి కొండ జలపాతాన్ని చూసేందుకు బెంగళూరుకు చెందిన తన స్నేహితురాలతో కలిసి ఆదివారం వెళ్ళింది.

అక్కడ ముప్పై అడుగుల ఎత్తైన కొండ చరియల నుండి నీరు ప్రవహిస్తోంది.అయితే మనందరగిరి వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా ఆమె లోయలోకి ఒక్కసారిగా జారిపోయి రాళ్ల మధ్యలో చిక్కుకుందని ఆపరేషన్ లో పాల్గొన్న పోలీసు అధికారి తెలియజేశారు.

Advertisement

హంస కొండగట్టులో కనిపించకుండా పోవడం చూసిన వారి స్నేహితురళ్లు సహాయం కోసం కేకలు వేసినట్లు అధికారులు తెలిపారు.

ఆ తర్వాత వెంటనే గ్రామస్తులు అక్కడ చేరుకొని సాయం చేయడానికి ప్రయత్నించగా.చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.దాంతో అగ్నిమాపక సిబ్బంది, అత్యవసరాల సేవల సిబ్బంది అక్కడి చేరుకొని 12 గంటల పాటు నిరంతరాయంగా కసరత్తు చేసి అమ్మాయిని కాపాడారు.

రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation )లో అగ్నిమాపక సిబ్బంది పోలీసులు కలిసి ఇసుక బస్తాలు వేసి పారుతున్న నీటిని మరోవైపు మళ్లించి సహాయక చర్యలు చేపట్టారు.మొదట అమ్మాయి కనిపించకపోవడంతో అందరూ ఆందోళన చెందారు.

అయితే, నీటి ప్రవాహం ఆగిపోయిన తర్వాత అమ్మాయి రాళ్ల మధ్య సజీవంగా కనిపించింది.రాళ్ల మధ్య నుండి అమ్మాయిని బయటకు తీసి ఆసుపత్రికి ప్రధమ చికిత్స కోసం తరలించారు.

ఆ సినిమాపైనే నిఖిల్ అభిమానుల ఆశలు.. అభిమానుల కోరిక నెరవేరుతుందా?
ఆర్టీసీ కార్గో పార్శిల్ మిస్సింగ్.. టెన్షన్ పడుతున్న అధికారులు.. ఎందుకంటే?

ప్రస్తుతం అమ్మాయి బాగానే ఉందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు