మద్యం తాగి ట్రాన్స్‌ఫార్మర్‌పై ఎక్కిన యువకుడు.. ఎంత పెద్ద కరెంట్ షాక్ తగిలిందో చూస్తే...

పూటుగా మద్యం తాగి ఆ మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలియక చాలామంది చావు నోట్లో తలపెడుతున్నారు.సింహాల బోనులోకి ఎంటర్ కావడం, యమ స్పీడ్‌గా రోడ్లపై డ్రైవ్ చేయడం, విషపూరితమైన పాములను బొమ్మలాగా పట్టి తిప్పడం వంటివి మద్యం బాబులు చేస్తూ షాక్‌లిస్తున్నారు.

 A Young Man Who Got Drunk And Climbed On The Transformer, Viral News, Latest N-TeluguStop.com

తాజాగా జనవరి 7, ఆదివారం ఉత్తరప్రదేశ్‌( Uttar Pradesh ) రాష్ట్రం, నోయిడా సిటీ( Noida ), జెవార్‌లో ఒక మందుబాబు విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌పై ఎక్కి పెద్ద సీన్ క్రియేట్ చేశాడు.ప్రజలు దిగమని చెబుతున్నా అతడు అలాగే ట్రాన్స్‌ఫార్మర్ పైకి ఎక్కేసి హై వోల్టేజ్ ఎలక్ట్రికల్ పట్టుకున్నాడు.

అంతే అతడికి భారీ షాక్ తగిలింది.అతడి బాడీ నుంచి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి.

ఆపై 25 అడుగుల ఎత్తుపై నుంచి ఒక శవంలాగా కింద పడిపోయాడు.ప్రేక్షకులు ఈ షాకింగ్ దృశ్యాలు చూడటానికి సన్నివేశం వద్ద గుమిగూడారు.కొందరు వీడియో రికార్డు చేసి సోషల్ మీడియా( Social media )లో షేర్ చేశారు.ఆ వీడియో చూసి చాలా మంది కంగు తింటున్నారు.లోకల్ మీడియా చెప్పినట్లుగా, సంఘటన జరిగినప్పుడు ఈ యువకుడు మద్యం మత్తులో ఈ మూర్ఖత్వపు పని చేశాడు.ఈ యువకుడిని నౌషాద్‌గా గుర్తించారు.

కింద పడిపోయిన తర్వాత కొంతమంది స్థానికులు దయ తలచి అతడిని సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు.ఆపై పోలీసులు వచ్చి అతడిని ఢిల్లీలోని సఫాదర్‌జంగ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఈ 35 ఏళ్ల వ్యక్తి భారీ కరెంట్ షాక్ తగిలినప్పటికీ విద్యుదాఘాతం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.తీవ్రంగా గాయపడినప్పటికీ అతను ప్రాణాలకి ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube