చైనాలో విజువల్ వండర్.. మల్టీ-లెవెల్ సిటీ చూస్తే మతిపోతుంది..

చాంగ్కింగ్( Chongqing ).చైనాలోని ఒక వింత నగరం! దీని గురించి యూట్యూబ్‌లో పీటర్ ( Peter on YouTube )అనే కంటెంట్ క్రియేటర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

చాంగ్కింగ్‌ని మొదటిసారి చూసేవాళ్లు షాక్ అవ్వడం ఖాయం.ఎందుకంటే ఈ నగరం డిజైన్ అంత విచిత్రంగా ఉంటుంది.

ఇక్కడ ఏ భవనానికి గ్రౌండ్ ఫ్లోర్ ఎక్కడ ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు.భవనాలన్నీ కొండల మీద, వేర్వేరు ఎత్తుల్లో ఉండటమే దీనికి కారణం అని పీటర్ తన వీడియోలో వివరించాడు.

ఇంకా చెప్పాలంటే, చాంగ్కింగ్‌లో తిరగడం ఒక పెద్ద సాహసం లాంటిది.రోడ్లన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి, ఒక చిక్కుముడిలా ఉంటాయి.

Advertisement

దీనికి తోడు 1997లో చైనా ప్రభుత్వం ఫులింగ్, వాన్‌క్సియన్, ఖియాన్‌జియాంగ్ ( Fuling, Wanxian, Qianjiang )అనే మూడు జిల్లాలను చాంగ్కింగ్‌లో కలిపేసింది.అంతే! చాంగ్కింగ్‌ ప్రపంచంలోనే అతి పెద్ద నగరాల్లో ఒకటిగా మారిపోయింది.

దాదాపు 3 కోట్ల 20 లక్షల జనాభాతో, ఆస్ట్రియా దేశమంత విస్తీర్ణంతో చాంగ్కింగ్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ చారిత్రాత్మక మార్పులే చాంగ్కింగ్‌ని ఇంత ప్రత్యేకంగా నిలిపాయి.

అక్కడి ఇంజనీర్లు తమ తెలివితేటలన్నిటినీ ఉపయోగించి అద్భుతమైన నగర ప్రణాళికలు రూపొందించారు.పీటర్ తన వీడియోలో ఒక షాకింగ్ సీన్ చూపించాడు.ఒక మెట్రో రైలు ఏకంగా 19 అంతస్తుల భవనం మధ్యలోంచి దూసుకుపోతుంది.

నమ్మశక్యంగా లేదు కదా? ఆ భవనాన్ని ఎంత పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశారంటే, రైలు వెళ్తున్నా ఎలాంటి శబ్దం రాదు, ఇంట్లోవాళ్లకి నిద్ర కూడా చెడదు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
హీరోలు ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తారు.. కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఇంకా వినండి.చాంగ్కింగ్‌లో అంతస్తుల లెక్కే వేరు.ఒకదానిపై ఒకటి పేర్చినట్టు ఉంటాయి.

Advertisement

పీటర్ ఒకసారి రోడ్డు మీద నిలబడి తన హోటల్‌ని చూశాడు.కళ్లెదుటే ఉన్నా అక్కడికి ఎలా వెళ్లాలో అర్థం కాలేదు పాపం, చివరికి స్థానికుల సాయం తీసుకుని, మూడు లిఫ్టులు ఎక్కితే కానీ, 33వ అంతస్తులో ఉన్న తన రూమ్‌కి చేరుకోలేకపోయాడు, అంటే ఊహించుకోండి, ఎంత కన్‌ఫ్యూజన్‌గా ఉంటుందో!అందుకే పీటర్ ఏమన్నాడంటే, చాంగ్కింగ్‌లో తిరగడం ఒక పెద్ద పజిల్‌ని సాల్వ్ చేసినట్టే ఉంటుందట.

కాస్త గందరగోళంగా అనిపించినా, దారి తప్పినా, అనుకోని ఆశ్చర్యాలు ఎదురైనా, వాటిని ఫుల్లుగా ఎంజాయ్ చేయమని సలహా ఇస్తున్నాడు.నిజంగా చాంగ్కింగ్‌ ఒక వరల్డ్ వండర్ అంతే.https://youtu.be/0kfhyOKM888?si=O5IH4JamC5kqNN5D ఈ లింకు మీద నొక్కి వీడియో చూసేయొచ్చు.

తాజా వార్తలు