Weight Loss Drink : వింట‌ర్ లో అధిక బరువుకు అడ్డుకట్ట వేయాలంటే తప్పకుండా దీన్ని డైట్ లో చేర్చుకోండి!

ప్రస్తుతం వింట‌ర్ సీజ‌న్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.సాధారణంగా ఈ సీజ‌న్ లో చలిపులి కారణంగా బద్ధకం విపరీతంగా పెరిగిపోతుంటుంది.

ఈ బద్ధకం వ‌ల్ల చాలా మంది వ్యాయామాలను నిర్లక్ష్యం చేస్తుంటారు.ఫలితంగా బరువు పెరుగుతారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను డైట్ లో చేర్చుకుంటే కనుక చలికాలంలో వ్యాయామాలు చేయకపోయినా సరే అధిక బ‌రువుకు అడ్డుకట్ట వేయొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేయండి.ముందుగా ఒక గ్లాస్ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ని వేసుకుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత ఒక యాపిల్ పండును తీసుకుని వాట‌ర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక నిమ్మ పండును తీసుకొని సగానికి కట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ పండు ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి.చివరిగా నానబెట్టుకున్న చియా సీడ్స్ ని వాటర్ తో సహా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన డ్రింక్ సిద్ధం అవుతుంది.

ఈ డ్రింక్ ను రోజుకు ఒక గ్లాస్ చొప్పున ప్రతి రోజూ తీసుకుంటే.అందులో ఉండే ప్ర‌త్యేక సుగుణాలు అతి ఆకలిని దూరం చేస్తాయి.అదే సమయంలో మెటబాలిజం రెట్టింపు చేస్తాయి.

దాంతో క్యాలరీలు వేగంగా క‌రుగుతాయి.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

ప్రస్తుత ఈ చలికాలంలో అధిక బరువుకు అడ్డుకట్ట వేయాలని భావించేవారు తప్పకుండా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు