సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.వాటిలో కొన్ని వీడియోలు చూడడానికి ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం ఇతరులను ఆలోచింపచేసేలాగా ఉంటాయి.
మరికొన్ని వీడియోలు అయితే మనసుకు హత్తుకునేలాగా ఉంటాయి.ఈ క్రమంలోనే ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి గుండె ఎంతో భారంగా నిండిపోతుంది అనే చెప్పాలి.అవయవాలు అన్ని సరిగ్గా ఉన్నవారే వాళ్ళ సొంతకాళ్ళ మీద వాళ్ళు నిలబడలేకపోతున్నారు.
కానీ వీడియోలో కనిపించే వ్యక్తి మాత్రం అవయవ లోపం ఉన్నాగాని ఆ అవయవలోపాన్ని లెక్కచేయకుండా తన సొంత కాళ్ళ మీద తాను నిలబడి అందరికి ఆదర్శంగా నిలిచాడు.
స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ.
ప్రత్యేకమైన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు.అసలు వివరాల్లోకి వెళితే.
నాగ్‌పూర్ నగరంలో ఇతని రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ తినడానికి ఎంతోమంది అతని బండి దగ్గర క్యూ కడుతున్నారు.స్ట్రీట్ ఫుడ్ అమ్మే అతనికి ఎడమ చేయి లేదు.
కేవలం కుడి చేయి మాత్రమే ఉంది.అయినా గానీ ఒంటి చేత్తో తన వృత్తి నైపుణ్యంతో స్టాల్ దగ్గర విన్యాసాలు చేస్తున్నాడు.
సింధీ స్టైల్ లో ఫేమస్ డిష్ మసాలేదార్ చోలే ను అమ్ముతాడు.
అలాగే తన వికలాంగ చేతిపై ప్లేట్ లను ఉంచి ఆహారాన్ని సైతం కస్టమర్లకు అందిస్తాడు. సింధీ చోలే రైస్‌తో పాటు, నాగ్‌పూర్ లోని ప్రముఖ స్ట్రీట్ ఫుడ్ తర్రి పోహాను,మసాలేదార్ చోలేను గత 15 సంవత్సరాలుగా నాగ్‌పూర్ లోని జరీపట్కా ప్రాంతంలో అమ్ముతున్నాడు.ఈ వీడియోను అమర్ సిరోహి అనే యూట్యూబర్ తన ఛానెల్ లో అప్లోడ్ చేశారు.
ఈ వీడియోను ఏకంగా 7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.
అవయవాలు అన్ని సారిగా ఉన్నవారే కష్టపడడం లేదు.ఒక చేయి లేకపోయినా సరే తన కాళ్ళమీద తాను నిబడిన వీడియోలో కనిపించిన వ్యక్తిని నెటిజన్లు ప్రశంసలతో పొగిడేస్తున్నారు.