ఇటలీలో వింత వస్తువు లభ్యం.. అదేంటో తెలిసి ఫ్యూజులు ఎగిరిపోయాయ్

మనం ఎంత మర్చిపోదామనుకున్నా కొన్ని ఘటనలు మన స్మృతులను దాటి పోలేవు.ముఖ్యంగా ప్రపంచ యుద్ధాలు, అవి మిగిల్చిన విషాదాలు నేటికీ మన కళ్ల ముందే కదలాడుతాయి.

 A Strange Thing Is Available In Italy Fuses Were Blown Knowing That , Italy, Vir-TeluguStop.com

లక్షల మందిని బలిగొన్న అణుబాంబులు తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది.రెండు పెద్ద అణుబాంబులను తన గుండెల మీద వేయించుకున్న జపాన్ కొద్ది కాలంలోనే తేరుకుంది.

ప్రపంచ దేశాలలో ఓ బలమైన ఆర్థిక శక్తిగా అవతరించింది.అయితే నేటికీ రెండ ప్రపంచ యుద్ధం నాటి గాయాలను మోస్తూనే ఉంది.

తాజాగా రెండవ ప్రపంచ యుద్ధాన్ని గుర్తు తెచ్చేలా ఓ సంఘటన జరిగింది.ఇటలీలో ఓ మత్స్యకారుడికి వింత వస్తువు కనపడింది.

దాని గురించి తెలుసుకుని, అక్కడకు వెళ్లిన అధికారులకు ఫ్యూజులు ఎగిరపోయాయి.అది రెండవ ప్రపంచ యుద్ధం నాటి బాంబు అని తెలుసుకున్నారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

70 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత కరువు కారణంగా ఇటలీ దేశంలోని పో నది ఎండిపోతోంది.అందులో నీరు చాలా తక్కువగా ప్రవహిస్తోంది.ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో మునిగిపోయిన బాంబును కనపడేలా చేసింది.కల్నల్ మార్కో నాసి మాట్లాడుతూ జూలై 25న మాంటువా నగరానికి సమీపంలోని బోర్గో విర్జిలియో గ్రామ సమీపంలో బాంబు కనుగొనబడిందని చెప్పారు.ఓ మత్స్యకారుడు దానిని చూసి అధికారులకు సమాచారం అందించాడని వెల్లడించారు.

అక్కడికి వెళ్లగా 450 కిలోగ్రాముల (దాదాపు 1,000-పౌండ్లు) అమెరికా తయారు చేసిన బాంబుగా గుర్తించామని చెప్పారు.ఆర్మీ నిపుణులు ఆదివారం దానిని నిర్వీర్యం చేసి, పేలకుండా చేశారన్నారు.

పేలుతుందేమోనన్న భయంతో ముందు జాగ్రత్తగా దాదాపు 3,000 మంది నివసించే పరిసర ప్రాంతాలను ఖాళీ చేయవలసి వచ్చింది.స్థానికంగా గగనతలం మూసివేయబడింది.

సమీపంలోని రోడ్లు, రైల్వే లైన్ మరియు జలమార్గంపై అన్ని ట్రాఫిక్‌లు నిలిపి వేయబడ్డాయి.బోర్గో వర్జిలియో మేయర్ ఫ్రాన్సిస్కో అపోర్టి, మొదట్లో ప్రజలు తరలించడానికి ఇష్టపడలేదు.

కానీ పరిపాలన యంత్రాంగం అందరినీ ఒప్పించగలిగింది.ఆ ప్రాంతాన్ని క్లియర్ చేస్తే తప్ప ఆపరేషన్ ముందుకు సాగేది కాదని ఆయన అన్నారు.

చివరికి ఏ ప్రమాదం సంభవించకుండా, బాంబును నిర్వీర్యం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube