అంగారకుడిపై ఎలుగుబంటి ముఖం లాంటి వింత ఆకారం.. నాసా ఫొటో వైరల్!

A Strange Shape Like A Bear's Face On Mars NASA Photo Goes Viral , Mars, Mars Bear Face, Mars NASA, Viral Photo, University Of Arizona, Mars Reconnaissance Orbiter, HiRISE

నాసా శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపై ఎలుగుబంటి ముఖంలా కనిపించే ఒక వింత రాతి నిర్మాణాన్ని తాజాగా కనుగొన్నారు.అరిజోనా యూనివర్సిటీకి చెందిన మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ ద్వారా ఈ నిర్మాణం వెలుగులోకి వచ్చింది.

 A Strange Shape Like A Bear's Face On Mars Nasa Photo Goes Viral , Mars, Mars Be-TeluguStop.com

ఈ నిర్మాణంలో ఎలుగుబంటి కళ్లలా కనిపించే జంట క్రేటర్స్, ముక్కు వంటి కొండ ఉన్నాయి.చూసేందుకు ఇది అచ్చం ఎలుగుబంటి లాగానే ఉండటం చాలా ఆశ్చర్యకరం.

Telugu Hirise, Mars, Mars Bear Face, Mars Nasa, Arizona-Latest News - Telugu

బిలం లేదా అగ్నిపర్వతం లేదా మట్టి బిలం మీద కొండలు ఇతర రకాల వస్తువులు స్థిరపడటం వల్ల బేర్ ఫేస్ లాంటిది ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.అంగారకుడిపై ఆర్బిటర్‌కు వింతలు కనిపించడం ఇదేం తొలిసారి కాదు.గతంలో స్మైలీ ఫేస్ వంటి బిలంను కనుగొంది.ఇక చంద్రునిపై మనిషి లేదా టోస్ట్ ముక్కపై యేసు ముఖాన్ని పోలిన నిర్మాణాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

Telugu Hirise, Mars, Mars Bear Face, Mars Nasa, Arizona-Latest News - Telugu

మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ ప్రయోగించినప్పటి నుంచి మార్స్ ఉపరితలాన్ని అధ్యయనం చేస్తూనే ఉంది.ఇది 17 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలకు అంగారక భూగర్భ శాస్త్రం, జియోమార్ఫాలజీ, ఖనిజశాస్త్రం గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది.ఇది అంగారకుడిపై పురాతన నదీ మార్గాలు, ఉపరితల నీరు, గత అగ్నిపర్వత కార్యకలాపాల సంకేతాలు వంటి అనేక ఆసక్తికరమైన లక్షణాలను వెల్లడించింది.ఫొటో డిసెంబర్ 12, 2022న ఏజెన్సీ హై-రిజల్యూషన్ ఇమేజింగ్ సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ (HiRISE) కెమెరా ద్వారా తీయబడింది.

ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.అంగారక గ్రహంపై ఇంకెన్ని అద్భుతాలు దాగి ఉన్నాయో అని కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube