నందమూరి హీరో తారకరత్న ఆరోగ్యం విషమంగా ఉందని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఫ్యాన్స్ ను ఒకింత టెన్షన్ పెడుతున్నాయి.లోకేశ్ పాదయాత్ర రోజునే ఈ ఘటన చోటు చేసుకోవడం తెలుగుదేశం పార్టీ వర్గాలను కలవరపెడుతోంది.
ఆయన గుండెలో బ్లాక్స్ ఉన్నాయని సమాచారం అందుతోంది.అయితే తారకరత్న శరీరం నీలి రంగులోకి మారడం ఫ్యాన్స్ ను మరింత టెన్షన్ పెడుతోంది.
అయితే వైద్యుల నుంచి అందుతున్న సమాచారం అందుతోంది. తారకరత్న శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉందని తెలుస్తోంది.శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువై రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే ఈ సమస్య వస్తుందని సమాచారం.ఇలాంటి పరిస్థితి ఎదురైన సమయంలో శరీరంలో ఆక్సిజన్ తక్కువై కార్బన్ డై యాక్సైడ్ ఎక్కువవుతుంది.
తారకరత్న పెదాలు, చేతివేళ్లు, కాలి వేళ్లు నీలం రంగులోకి మారడం వెనుక అసలు కారణాలు ఇవేనని తెలుస్తోంది.
మరోవైపు తారకరత్న త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.2024 ఎన్నికల్లో తారకరత్న ఏపీలోని ప్రముఖ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.నందమూరి కుటుంబ సభ్యులు మాత్రం ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం బెంగళూరులోని ప్రముఖ ఆస్పత్రిలో నందమూరి తారకరత్నకు చికిత్స జరుగుతోంది.
తారకరత్న ఆరోగ్యం గురించి ప్రస్తుతం పలు ఫేక్ వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ వార్తల విషయంలో అభిమానులు కొంతమేర అప్రమత్తంగా ఉంటే మంచిది.తారకరత్న కుటుంబ సభ్యులు మాత్రం ఆయన ఆరోగ్యం విషయంలో ఒకింత టెన్షన్ పడుతున్నారు.
ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని తెలిసి ఫ్యాన్స్ సైతం షాకవుతున్నారు.నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో సైతం అద్భుతంగా నటించి తారకరత్న మెప్పించారు.
నందమూరి హీరోల సినిమాలలో మాత్రం తారకరత్న నటించేదనే సంగతి తెలిసిందే.