నాసా శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపై ఎలుగుబంటి ముఖంలా కనిపించే ఒక వింత రాతి నిర్మాణాన్ని తాజాగా కనుగొన్నారు.అరిజోనా యూనివర్సిటీకి చెందిన మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ ద్వారా ఈ నిర్మాణం వెలుగులోకి వచ్చింది.
ఈ నిర్మాణంలో ఎలుగుబంటి కళ్లలా కనిపించే జంట క్రేటర్స్, ముక్కు వంటి కొండ ఉన్నాయి.చూసేందుకు ఇది అచ్చం ఎలుగుబంటి లాగానే ఉండటం చాలా ఆశ్చర్యకరం.
బిలం లేదా అగ్నిపర్వతం లేదా మట్టి బిలం మీద కొండలు ఇతర రకాల వస్తువులు స్థిరపడటం వల్ల బేర్ ఫేస్ లాంటిది ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.అంగారకుడిపై ఆర్బిటర్‌కు వింతలు కనిపించడం ఇదేం తొలిసారి కాదు.గతంలో స్మైలీ ఫేస్ వంటి బిలంను కనుగొంది.ఇక చంద్రునిపై మనిషి లేదా టోస్ట్ ముక్కపై యేసు ముఖాన్ని పోలిన నిర్మాణాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ ప్రయోగించినప్పటి నుంచి మార్స్ ఉపరితలాన్ని అధ్యయనం చేస్తూనే ఉంది.ఇది 17 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలకు అంగారక భూగర్భ శాస్త్రం, జియోమార్ఫాలజీ, ఖనిజశాస్త్రం గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది.ఇది అంగారకుడిపై పురాతన నదీ మార్గాలు, ఉపరితల నీరు, గత అగ్నిపర్వత కార్యకలాపాల సంకేతాలు వంటి అనేక ఆసక్తికరమైన లక్షణాలను వెల్లడించింది.ఫొటో డిసెంబర్ 12, 2022న ఏజెన్సీ హై-రిజల్యూషన్ ఇమేజింగ్ సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ (HiRISE) కెమెరా ద్వారా తీయబడింది.
ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.అంగారక గ్రహంపై ఇంకెన్ని అద్భుతాలు దాగి ఉన్నాయో అని కామెంట్లు చేస్తున్నారు.