ఆస్ట్రేలియా బీచ్‌లో వింత పురుగు ప్రత్యక్షం.. షాక్‌లో స్థానిక ప్రజలు..

మన గ్రహం కొన్ని నిజంగా విచిత్రమైన జీవులకు నిలయం, వాటిలో కొన్ని మనకు పెద్దగా తెలియవు.సోషల్ మీడియా( Social media) పుణ్యమా అని అప్పుడప్పుడు ఈ వింత జీవులు వెలుగులోకి వస్తున్నాయి.

 A Strange Insect Appeared On The Australian Beach Local People In Shock, Austra-TeluguStop.com

ప్రస్తుతం ఒక వీడియో ఆన్‌లైన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది, చాలా మంది వ్యక్తులు ఎప్పుడూ వినని ఒక అసాధారణమైన, పొడవైన పురుగును ఆ వీడియోలో చూడవచ్చు.

ఓ వ్యక్తి బీచ్ లో తిరుగుతూ ఈ అద్భుతమైన దృశ్యాన్ని చిత్రీకరించాడు.14 సెకన్ల వీడియోలో, ఒక చిన్న చేపను తడి ఇసుకలో రుద్దుతున్నాడు.అలా చేస్తున్నప్పుడు, ఒక కీటకం లాంటి జీవి ఇసుక నుంచి బయటికి వచ్చి చేపకు అతుక్కోవడానికి ప్రయత్నిస్తుంది.

చాలా చాకచక్యంగా ఒక క్లిప్ తో ఆ జీవిని బయటకు తీస్తాడు, అప్పుడు ఒక పాము లాంటి పురుగు బయటపడుతుంది.ఈ వీడియో కి “ఆస్ట్రలోను ఫిస్ లేదా బీచ్ వార్మ్( Beach worm), మీరు దానిని చూడలేరు, కానీ అది మిమ్మల్ని చూస్తుంది.” అని దీనికి ఒక క్యాప్షన్ కూడా జోడించాడు.

ఈ భయానకమైన దృశ్యం చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తే, మరికొందరు భయంతో వణికిపోయారు.ఈ పోస్ట్ కి 41,000 లైక్‌లు, 21 మిలియన్ల వీక్షణలు వచ్చాయి.

ఆస్ట్రలోనుఫిస్( Australonuphis) అనేది ఆస్ట్రేలియాకు చెందిన ఒక రహస్యమైన బీచ్ పురుగు.ఈ పురుగులు 2 మీటర్ల (6.5 అడుగులు) పొడవు వరకు పెరుగుతాయి.వీటికి కళ్ళు లేవు, కానీ వాసన చూసే శక్తి చాలా బాగా ఉంటుంది.

కుళ్ళిపోయిన మాంసం, చేపలు, ఒడ్డుకు కొట్టుకువచ్చిన పాచి వీటి ఆహారం.ఆస్ట్రేలియాతో పాటు మధ్య, దక్షిణ అమెరికాలో కూడా నాలుగు రకాల ఆస్ట్రలోనుఫిస్ జీవులు కనిపిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube