మిగ్ జామ్ తుపాను బాపట్ల సమీపంలో తీరం దాటిందని తెలుస్తోంది.దీంతో తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.ఈ క్రమంలోనే పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
అదేవిధంగా భారీ వర్షాల ప్రభావంతో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి.మిగ్ జామ్ తుపాను నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
అలాగే పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.