వయసు పైబడే కొద్దీ చర్మం సాగుతూ ఉంటుంది.చర్మం సాగటం వల్ల ముడతలు ఏర్పడుతుంటాయి.
దాంతో ముఖంలో కల తప్పుతుంది.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే సాగిన చర్మం టైట్ గా అవ్వడమే కాదు వైట్ గా సైతం మారుతుంది.
మరి ఇంతకీ ఆ సింపుల్ హోమ్ రెమెడీ ఏంటి అనేది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక అరటి పండును తీసుకుని తొక్క తొలగించి సన్నగా స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు స్లైసెస్ ను వేసుకోవాలి.అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ను వేసుకోవాలి.
చివరిగా రెండు టేబుల్ స్పూన్లు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో కాస్త మందంగా ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే సాగిన చర్మం టైట్ గా మారుతుంది.
ముడతలు క్రమంగా మాయం అవుతాయి.
అలాగే స్కిన్ వైట్నింగ్ కు కూడా ఈ రెమెడీ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.చాలా మంది చర్మాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే క్రీములను కొనుగోలు చేసి వినియోగిస్తుంటారు.కానీ, అటువంటి క్రీమ్స్ ను వాడే బదులుగా ఇప్పుడు చెప్పుకున్న సింపుల్ హోమ్ రెమెడీని పాటిస్తే చర్మం సహజంగానే వైట్ గా మరియు బ్రైట్ గా మారుతుంది.
కాబట్టి, తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.