ఈ సంక్రాంతి కి తెలుగు ప్రేక్షకుల ముందుకు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన వారసుడు మరియు స్టార్ హీరో నటించిన తెగింపు ఇంకా చిన్న సినిమా కళ్యాణం కమనీయం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఈ సినిమా లు టాక్ తో సంబంధం లేకుండా సంక్రాంతి సెలవల కారణం గా భారీగానే కలెక్షన్స్ నమోదు చేయడం జరిగింది.
బాక్సాఫీస్ వద్ద అన్ని సినిమా లు కూడా మంచి కలెక్షన్స్ రాబట్టడం తో ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు బాక్సాఫీస్ వర్గాల వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ మధ్య కాలం లో ఇలాంటి టాక్ తో అంతటి భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్న సినిమా లు ఇవే అంటూ ప్రచారం జరుగుతుంది.
సంక్రాంతి కారణం గా సినిమా లకు కలిసి వచ్చిందని ముఖ్యం గా వీర సింహా రెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమా లో భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్నాయి.

అంటే అది కేవలం సంక్రాంతి సీజన్ అవ్వడం వల్లే అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ఇక ఈ సినిమా లు పాజిటివ్ టాక్ దక్కించుకొని సూపర్ హిట్ అనిపించుకుంటే కచ్చితం గా కలెక్షన్స్ వంద ల కోట్ల లో నమోదయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.కళ్యాణం కమనీయం చిన్న సినిమా అయినప్పటికీ పోటీ తీవ్రం గా ఉన్నప్పటికీ మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నది అంటే

సంక్రాంతి సీజన్ ఎంతగా ఉపయోగపడిందో అర్థం చేసుకోవచ్చు.బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేస్తున్న సినిమా లు ఏ స్థాయిలో ఓపెనింగ్స్ నమోదు చేస్తాయో అలాగే సంక్రాంతి సినిమా లు కూడా ఓపెనింగ్ అదే స్థాయిలో నమోదు చేయడం జరిగింది.మరో నాలుగు ఐదు రోజుల పాటు సంక్రాంతి సందడి కొనసాగే అవకాశం ఉంది.
కనుక అప్పటి వరకు కలెక్షన్స్ నిలకడగా వస్తాయని ప్రచారం జరుగుతోంది.







