జగన్ కి షాక్..ఏపీలో ఆ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్న షర్మిల..!!

వైయస్ రాజశేఖర్ రెడ్డి ( Y.S.Rajashekhar Reddy ) ముద్దుబిడ్డగా తెలంగాణలో వైఎస్ఆర్టీపి పార్టీ పెట్టిన షర్మిలకు ఎన్నికల్లో భారీ షాక్ తగిలేలా ఉంది.

ఎందుకంటే కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా ముందుకు రావడం లేదు.

ఇక కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తానని బహిరంగంగానే బయట పెట్టినప్పటికీ వీరి మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు.దాంతో కాంగ్రెస్ పార్టీ షర్మిల ( Sharmila ) ని పక్కన పెట్టేసింది.

అయితే కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సారధిగా వ్యవహరించమని కోరారట.కానీ షర్మిల మాత్రం దానికి ఒప్పుకోలేదు.

దాంతో వీరి మధ్య చర్చలు సఫలీకృతం కాలేదు.దాంతో ఈసారి తెలంగాణ ( Telangana ) ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి షర్మిల బరిలో దిగింది.అయితే తాజా పరిస్థితిలు చూస్తే కనీసంనియోజకవర్గాల్లో నిలబడడానికి అభ్యర్థులు కూడా లేరు.

Advertisement

దింతో తెలంగాణ ఎన్నికలు అయిపోవడంతోనే ఆంధ్రప్రదేశ్లోకి రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చూస్తుందట షర్మిల.అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ ( YCP ) లో కీలకపాత్ర పోషించిన షర్మిల అన్న జగన్ మోహన్ రెడ్డి గెలవడానికి తన శాయశక్తుల పోరాడింది.

ఇక జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచాక షర్మిలని పక్కన పెట్టాడు.దాంతో ఈ విషయాన్ని చాలా సార్లు పరోక్షంగా షర్మిల మీడియా ముందు బయటపెట్టింది.అయితే వచ్చే ఏపీ ఎలక్షన్స్ లో షర్మిల జగన్ కి గట్టి షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తు అంతలా కనిపించకపోవడంతో షర్మిల ఏపీ వెళ్లాలని చూస్తుందట.తెలంగాణ ఎన్నికలు అయిపోవడంతోనే ఏపీ కాంగ్రెస్ సారథిగా భాద్యతలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.ఇక ఇదే జరిగితే జగన్మోహన్ రెడ్డి ( Jagan mohan reddy ) పార్టీకి పెద్ద నష్టం వచ్చి పడుతుంది.

మరి చూడాలి షర్మిల ఏపీ వైపు వెళ్తుందా లేదా తెలంగాణలోనే ఉండిపోతుందా అనేది.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు