దేనికైనా కొంత హద్దూ పద్దూ ఉండాలి.ఉంటుంది.
ఒక్క రాజకీయాలకు మాత్రం ఏ మాత్రం లెక్కా ఉండవు.అవి రోజు రోజుకూ తమ విలువలను కోల్పోతున్నాయి.
జనం దృష్టిలో చులకనౌతున్నాయి.ఎన్నికల సమయంలో ఈ దిగజారుడు మరింత ఎక్కువ అవుతుంది.
ఇప్పుడు తాజాగా మునుగోడు ఎన్నికల విషయంలో రాజకీయ దివాలా కోరుతనం స్పష్టమవుతుంది.ఓటర్లను నానా విధాలుగా ప్రలోభ పెట్టేందుకు పార్టీలన్నీ అలుపు లేకుండా కృషి చేస్తున్నాయి.
ఇందులో భాగంగా మద్యాన్ని ఏరులుగా పారిస్తున్నారు.ధనాన్ని విచ్చలవిడిగా కుమ్మరిస్తున్నారు.
ఎన్నికలని పక్కా వ్యాపారం గా మార్చేస్తున్నారు.పెట్టుబడి పెట్టాలి దాన్ని తిరిగి రాబట్టాలి.
వ్యాపార సూత్రంతో పక్కా ప్రణాళికలతో రాజకీయాలు చేస్తున్నారు.ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ప్రజలని లోబర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ముమ్మరంగా.
ఒకరకంగా ఇది రాజకీయ దివాళ కోరుతనం అని చెప్పవచ్చు.నేడు రాజకీయాలు ఎంతగా పతనమైనాయో మునుగోడును చూస్తే అర్థమవుతుంది.
తాజాగా ఎమ్మెల్యేలు కొనుగోలు స్కాం బయటపడింది.ఎమ్మెల్యేలను కొనేందుకు బిజెపి భారి ప్రణాళిక రచించిందని ఆరోపణలు వచ్చాయి.ఒక్కొక్క ఎమ్మెల్యేకి 50 నుంచి 100 కోట్లు ఆఫర్లు ఇచ్చినట్లు ఇటీవల వీడియోలో బయల్పడింది.మొయినాబాద్ ఫామ్ హౌస్ లో అసలు ఏం జరిగింది.? ఆ ఫామ్ హౌస్ లో జరిగిన నిజ నిజాలు ఏంటి? ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది? మధ్యలో స్వామీజీలు గా చెప్పుకుంటున్న ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఎంత? ఆ స్వామీజీలని ఎవరు రప్పించారు? వారితో మధ్యవర్తిత్వం చేసిన వారు ఎవరు? తెర వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? ఇవన్నీ నిగ్గు తేలాల్సిన అంశాలు.ఇందులో నిజా నిజాలు సంగతి ఎలా ఉన్నా కొంతవరకు రాజకీయ నేతల దివాళ కోరుతనం అక్రమాలు ప్రస్ఫుటమవుతున్నాయి.
ఇక దీనిపై వెంటనే స్పందించిన బిజెపి మంత్రి కిషన్ రెడ్డి ఈ వ్యవహారంలో అవసరమైతే సిబిఐ లేక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపట్టాలని కోరాడు.టిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ స్పందిస్తూ దీని పై విచారణ పూర్తి వివరణ వచ్చే వరకు తమ మంత్రులను నోరు మెదపవద్దని ఆజ్ఞాపించాడు.
అసలు ఇక్కడ ఏం జరిగింది? ఈ ప్రణాళిక దర్శకుడు ఎవరు? నిజంగా ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందా? యాదృచ్ఛికంగా జరిగిందా? లోతుగా పరిశీలించాల్సిన అంశం.

ఆ ఫామ్ హౌస్ లోని ఆ నలుగురు మంత్రుల మధ్య ఉన్న స్వామీజీలు ఎవరు పిలిస్తే వచ్చారు? ఎవరు ఎన్నుకున్నారు వారిని మధ్యవర్తులుగా? అసలు స్వామీజీలకి రాజకీయాలతో సంబంధం ఏంటి? ఇతర రాష్ట్రాల నుంచి సైతం వారిని రప్పించాల్సిన అవసరం ఏంటి? వా రేమన్నా ఇటువంటి ప్రక్రియలలో నిపుణులా?అని ప్రజల్లో కలిగిన అనుమానాలు.టిఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు తమ నేతలను కొనుగోలు చేయడానికి బిజెపి పెద్ద కుట్ర పన్నిందని అనడానికి అక్కడ మరిన్ని సాక్ష్యాలు దొరకలేదు.నిజానికి అక్కడ ఏ బిజెపి కార్యకర్త గాని కనీసం నాయకుడు గాని నేతగాని కూడా కనిపించలేదు.
అంతేగాక అక్కడ ఏ బిజెపి నేత యొక్క మాటలు గాని ఆడియోలు కానీ వీడియోస్ కానీ రికార్డు అవ్వలేదు.

ఎవిడెన్స్ లేకుండా అది బిజెపి కుట్రని ఎలా చెప్పగలము? టిఆర్ఎస్కు బిజెపి కాకుండా కాంగ్రెస్ కూడా ప్రతిపక్షమే కదా! అక్కడ ఏ కార్యకర్తలు కానీ బిజెపి నేతలు గాని తమ జెండాలు పట్టుకొని గాని కండువాలు ధరించి గాని కనిపించలేదు.మరి అటువంటి అప్పుడు టిఆర్ఎస్ ఇది బిజెపి కుట్రని ఎలా కచ్చితంగా చెప్పగలదు.అనేది 100 విలియన్ల ప్రశ్న.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ అంత ధనం ఉన్న పార్టీ కాదని ఎమ్మెల్యేలను కొనుక్కొనే శక్తి సామర్థ్యాలు తమకు లేవని వివరించారు మీడియా ముందు.ఎమ్మెల్యేలను కొనుక్కోవడం అనేది ఈరోజు జరిగిన హఠాత్ సంఘటన కాదు.
ఇదేమి కేవలం ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటన కాదు.గతంలో ఎన్నోసార్లు దేశంలో ఇటువంటి సంఘటనలు జరిగాయి.
జరుగుతున్నాయి ఇంకా జరగబోతాయి.ఇవన్నీ గుట్టుగా ఏ హోటల్ లోనో విదేశాల్లోలో పార్టీ నాయకులను గుంపుగా తీసుకొని వెళ్లి జరిపే రహస్య తతంగం.
కాక పోతే ఈమధ్య వీడియో కెమెరాలతో రహస్య చిత్రీకరణ స్టింగ్ ఆపరేషన్ ద్వారా రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతున్నారు.
గతంలో దేశంలో ఇంత టెక్నాలజీ లేక పోవడం వల్ల ఇటువంటి సంఘటనలు బయటపడలేదు.
ఏది ఏమైనప్పటికీ ఇటువంటి దుష్ట రాజకీయాలకు దుర్మార్గ చర్యలకు ప్రజలే చరమగీతం పాడాలి.ఇందులో నిజం తేల్చేందుకు కిషన్ రెడ్డి చెప్పినట్టు సిట్టింగ్ జడ్జితో పూర్తిగా విచారణ జరిపించాలి.
ప్రజలకు రాజకీయాల పట్ల రాజకీయ నాయకుల పట్ల విశ్వాసం పెరగాలి.అలా జరగాలంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పార్టీ నేతలు జాగ్రత్త పడాలి.
ప్రజల్లో తమ పట్ల ఇప్పటికే కలిగిన యావగింపుని అసహ్యాన్ని రూపుమాపేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలి.ఎన్నికలలో పారదర్శకత రావాలి.
ప్రజల్లో చైతన్యం రావాలి.ఇటువంటి చీప్ ట్రిక్స్ కి డర్టీ పాలిటిక్స్కి చరమ గీతం పాడాలి.
ఇది ఇలా ఉండగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుటాహుటిన యదాద్రికి వెళ్ళారు.అక్కడ కేసుతో తమకు కానీ బిజెపి కి కానీ సంబంధం లేదని తడి బట్టలతో ప్రమాణం చేశారు.
దానికి తెరాసా నాయకులు బండి సంజయ్ కాదు అమిత్ షా ను రప్పించి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.మరోపక్క ఈ కేసులో కీలక నిందితులు గా ఉన్న ముగ్గురు స్వాముల ఆడియోలు బయటకు వచ్చి కొంత అనుమానాలకు తావిస్తుంది.
ఈ ముగ్గురు నిందితులను నగరం దాటి వెల్లోదని హై కోర్టు ఆదేశించింది.ఏది ఏమైనా ప్రజలు ఇటువంటి దుష్ట రాజకీయాలకు చరమ గీతం పాడాలి.
నిజానిజాలు తేలాక ఆ పార్టీలను ప్రజలు గుర్తించి వచ్చె ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలి.ఈ కేసులో తెర వెనుక ఉన్న బడా నేతల గుట్టు ఇడి, సీబీఐ లేదా సుప్రీం కోర్టు ద్వార వీలైనంత త్వరగా పరిష్కరించాలి.
నిందితులను కటి నంగా శిక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.పతనమైన రాజనీతిని తిరిగి పునరుద్ధరించాలి.







