ఆంద్రప్రదేశ్ రాష్ర్టంలో కడప-కర్నూలు-అనంతపురం, చిత్తూరు-నెల్లూరు-ప్రకాశం, విశాఖపట్నం-విజయనగరం-శ్రీకాకుళం జిల్లాల గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు చెందిన ఐదు మంది ప్రస్తుత శాసనమండలి సభ్యుల పదవీకాలం 2023 వ సంవత్సరంలో మార్చి 29 న ముగియనుంది.గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల నుండి పశ్చిమ రాయలసీమకు చెందిన వెన్నుపూస గోపాల్ రెడ్డి,తూర్పు రాయలసీమకు చెందిన యండపల్లి శ్రీనివాస రెడ్డి,ఉత్తరాంధ్ర నుంచి పి.
వి.ఎన్.మాధవ్ మరియు ఉపాధ్యాయ నియోజకవర్గాల నుండి పశ్చిమ రాయలసీమ కు చెందిన కత్తి నరసింహా రెడ్డి,తూర్పు రాయలసీమ కు చెందిన విఠపు బాలసుబ్రహ్మణ్యంలు పదవీ విరమణ చేయనున్నారు.వెన్నుపూస గోపాల్ రెడ్డి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నుంచి.పి.వి.ఎన్ మాధవ్ బి.జె.పి నుంచి,కత్తి నరసింహా రెడ్డి ఇండిపెండెంట్ గా మరియు యండవల్లి శ్రీనివాస రెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యంలు ప్రోగ్రెసివ్ డెమాక్రిటిక్ ఫ్రంట్ లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఈ శాసనమండలి నియోజకవర్గాలలో ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే చేపట్టింది.
ఇందులో భాగంగా ఈ నియోజకవర్గాలలో ఓటర్ల నమోదు ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికలకు కేవలం 18 నెలల సమయం మాత్రమే ఉంది.అందువల్ల రాష్ట్రంలోని అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.ఎన్నికలకు తొమ్మిది నెలల సమయం ఉండగానే అధికార వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మరియు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలు ఇప్పటికే పట్టభద్రుల స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించాయి.ఈ ఎన్నికలలో అత్యధిక మెజారిటీ తో గెలుపొంది ప్రజలలో తమ ప్రాభవం ఇంకా పెరిగిందని నిరూపించుకోవాలని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతుంది.అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి పూర్వవైభవం పొందేందుకు సర్వశక్తులు ఉపయోగిస్తుండడం గమనార్హం.ఉపాధ్యాయ నియోజక వర్గాల నుంచి సహజంగా వామపక్ష పార్టీల మద్దతు ఉన్న ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థులు లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధిస్తుంటారు.
ఈ ఎన్నికలలో మాత్రం ఉపాధ్యాయ నియోజక వర్గాలలో తాము మద్దతు ఇచ్చే అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కడుపుతున్నాయి.

పట్టభద్రుల నియోజకవర్గాలలో పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున ప్రస్తుత శాసనమండలి సభ్యులైన వెన్నుపూస గోపాల్ రెడ్డి తనయుడు వెన్నుపూస రవీంద్ర రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరపున భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్జి, తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుంచి వై.యస్.ఆర్.సి.పి తరపున గూడూరు పట్టణానికి చెందిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరపున కంచర్ల శ్రీకాంత్ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల నియోజకవర్గం నుంచి వై.యస్.ఆర్.సి.పి తరపున బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యస్.సుధాకర్,తెలుగుదేశం పార్టీ తరపున గాడు చిన్నికుమారి లక్ష్మిలు ఎన్నికల బరిలో నిల్వనున్నారు.
తమ అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని భారతీయ జనతా పార్టీ ఇటీవల ప్రకటించింది.జనసేన పార్టీ మాత్రం స్తబ్దుగా ఉంది.
ప్రచారంలో అన్నిపార్టీలకన్నా తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది.ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టక మునుపే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వారి వారి నియోజక వర్గాలలో విస్తృతంగా పర్యటనలు చేశారు.
పశ్చిమ రాయలసీమ టి.డి.పి అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విన్నూతన ప్రచారానికి శ్రీకారం చుట్టారు.పశ్చిమ రాయలసీమ నియోజక వర్గంలో ఉన్న మూడు జిల్లాలలోని టి.డి.పి ప్రజాప్రతినిధులు మరియు ఇంఛార్జీల సహకారంతో అన్ని నియోజకవర్గాల్లో స్థానిక పట్టభద్రులతో సమావేశమై నవంబర్ 7 వతేది లోపల ఓటర్లుగా నమోదు చేసుకుని తనను గెలిపించమని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇదే పంథాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా అనుసరిస్తుండడం గమనార్హం.







