హెచ్ -4 కొనసాగించండి..భారతీయుల అభ్యర్ధన...!!

అమెరికా ప్రభుత్వం గత కొంత కాలంగా వీసాల విధానంపై అనుసరిస్తున్న తీరు ఎంతో మంది ఎన్నారైలని ఇబ్బందులకి గురిచేస్తోంది.

ముఖ్యంగా భారతీయ ఎన్నారైలకి ఈ పరిస్థితులు ఎంతో ఇబ్బంది కరంగా మారాయి.

హెచ్ -1 బీ వీసా దారులు జీవిత భాగస్వాములకు పని చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చే హెచ్ -4 వర్క్ పర్మిట్ వీసా విధానాన్ని ఎత్తేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.దాంతో ఆందోళన చెందిన భారత ఎన్నారైలు.

అనేక మంది ఈ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ఓ పిటిషన్ ని శ్వేత సౌధం వెబ్సైటు లో వేశారు.ఎంతో మంది భారత ఎన్నారైలు కలిసి ఒక్కటిగా ఏర్పడుతూ ఈ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది.

అయితే అమెరికాలో ఉంటున్న భారత ఐటీ నిపుణులు అందరిని ఒక దరికి చేర్చే ఐటీ ప్రో అలయెన్స్‌ అనే నాన్‌ ప్రాఫిట్‌ సంస్థ ఈ పిటిషన్‌ వేసినట్లుగా తెలుస్తోంది.సుమారు లక్ష మంది నేరుగా అర్ధించిన పక్షంలో అమెరికన్ ప్రభుత్వం ఈ పిటిషన్ పై స్పందించి తీరాల్సిందే.అయితే ఇప్పటి వరకూ ఈ పిటిషన్ కి అనుకూలంగా 43,332 మంది సంతకాలు చేయడం జరిగిందని సంస్థ తెలిపింది.

Advertisement
జాక్ పాట్ కొట్టిన మేస్త్రి.. నెలకు కోటి చొప్పున 30 ఏళ్ల వరకు..
Advertisement

తాజా వార్తలు