పాత సినిమాల్లో ఒక కర్రను తీసుకుని తలపై కొడితే గతం మర్చి పోయినట్లుగా చూపిస్తూ ఉండే వారు.ఇప్పట్లో అలాంటి సీన్స్ చూస్తే నవ్వు వస్తుంది.
కాని అప్పుడు ఎక్కువగా అలాంటి సీన్స్ కనిపించేవి.ఒక దెబ్బకు గతం మర్చిపోయిన వారు, మరో దెబ్బకు గతం గుర్తుకు రావడంను మనం చూశాం.
అయితే ఇప్పుడు ఆ సంఘటన నిజ జీవితంలో జరిగింది.ఈ విచిత్రమైన సంఘటన సినిమాటిక్‌గా ఉంది.
పెళ్లి అయిన అయిదు పదుల వయసు మహిళ తన గతంను పాక్షికంగా మర్చి పోయి పెళ్లి కాలేదు, పిల్లలు లేరు అంటోంది.దాంతో ఆమె కుటుంబ సభ్యులు కిందా మీద పడుతున్నారు.
ఇంతకు విషయం ఏంటీ అంటే… అమెరికా లూసియానాకు చెందిన 56 ఏళ్ల బటాన్ రూజ్ గత సంవత్సరం సెప్టెంబర్‌లో విపరీతమైన తలనొప్పి రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యింది.కొన్ని నెలల పాటు ఆమెకు అక్కడే ట్రీట్మెంట్ జరిగింది.
ఇటీవలే ఆమె పూర్తిగా కోలుకుందని వైధ్యులు నిర్థారించారు.అయితే ఆమె పాక్షిక కోమా నుండి బయటకు రాగానే తాను 18 ఏళ్ల అమ్మాయిని అన్నట్లుగా ప్రవర్తిస్తుంది.
అంటే ఆమె 18 ఏళ్ల వయసుకు వెళ్లి పోయింది.ఆమెకు 18 ఏళ్లు ఉన్న సమయంలో రొనాల్డ్ రెగన్ అధ్యక్షుడిగా ఉన్నాడు.
మన ప్రెసిడెంట్ ఎవరు అంటూ ప్రశ్నించిన సమయంలో ఆమె రొనాల్డ్ రెగన్ అని సమాధానం చెప్పడంతో చికిత్స అందించిన నర్స్ అవాక్కయింది.

ఆమె 38 ఏళ్లు వెనక్కు వెళ్లినట్లుగా వైధ్యులు నిర్థారించారు.ఆమెకు 56 ఏళ్లు అంటే అస్సలు నమ్మడం లేదు.మీకు పెళ్లి అయ్యింది, పిల్లలు ఉన్నారు, వారికి పిల్లలు కూడా ఉన్నారు అంటే ఆమె అస్సలు ఒప్పుకోవడం లేదు.
తాను 18 ఏళ్ల వయసులోనే ఉన్నాను అంటూ అప్పటి జ్ఞాపకాలు అన్ని చెబుతుంది.ఆమెను మెల్ల మెల్లగా కుటుంబంలో కలుపుకునేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కుటుంబ సభ్యులకు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి.18 ఏళ్లకు నేను ఎందుకు ఇలా అయ్యాను అంటూ పదే పదే అంటోందట.అయితే కుటుంబ సభ్యులు తమను తాము పరిచయం చేసుకుని ఆమెకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.