Fireworks Mishap : వెళుతున్న కారులో క్రాకర్స్ కాల్చిన వ్యక్తి.. కట్ చేస్తే ఊహించని షాక్..

కొంతమంది ధైర్యసాహసాలు చేయడానికి చాలా ఇష్టపడతారు.కానీ కొన్నిసార్లు వారు చేసే సాహసాల ఘోరంగా విఫలమై ప్రమాదకరంగా మారతాయి.

ఇటీవల, కొంతమంది యువకులు ఒక లగ్జరీ బీఎండబ్ల్యూ కారు( BMW Car )లో ప్రమాదకరమైన స్టంట్ చేయడానికి ప్రయత్నించారు.వారు కారు కదులుతున్న పైన బాణాసంచా ఉంచి దానికి నిప్పు అంటించారు.

కారుపై ఆ క్రాకర్ కాలుతూ అదిరిపోయే అనుభవాన్ని అందిస్తుందని అనుకున్నారు కానీ బాణాసంచా కారు పైకప్పు పైనుంచి జారీ కారు లోపల పడిపోయింది.ఇది కారులో భారీ అగ్నిప్రమాదానికి దారి తీసింది.

ఈ ఘటనను ఎవరో వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియా( Social media )లో పోస్ట్ చేశారు.ఆ వీడియో చాలా వైరల్ అయింది.

Advertisement

ఈ వీడియో ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది.చాలా మంది వ్యక్తులు ఈ యువకుల బాధ్యతారాహిత్య ప్రవర్తనను ఘాటుగా విమర్శించారు.ఈ స్టంట్ ఆలోచనా రహితమైనది మాత్రమే కాకుండా, చాలా ప్రమాదకరమైనది అని చాలా మంది అభిప్రాయపడ్డారు.

చాలా మంది ప్రజలు ఈ యువకుల చర్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ ఘటన కార్లను స్టంట్‌ల కోసం ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి చర్చకు దారితీసింది.స్టంట్లు చాలా థ్రిల్ అందిస్తాయి కానీ భద్రతకు ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి లేదంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంది.హై-ఎండ్ వాహనాన్ని ఉపయోగిస్తున్న సరే, సరిగ్గా ప్లాన్ చేసి అమలు చేయకపోతే ఊహించని ప్రమాదాలకు దారి తీస్తుంది.

వైరల్ అవుతున్న వీడియోలో కారు సీట్లు బాణాసంచా( Fireworks ) వల్ల ఎంతలా డ్యామేజ్ అయ్యాయో మనం చూడవచ్చు.ఇకపోతే ఈ వీడియో చాలా మందికి నచ్చింది.

రామోజీరావు మృతికి ప్రముఖుల సంతాపం
ఈనాడు గ్రూప్ అధినేత గౌ "శ్రీ చెరుకూరి రామోజీరావు" గారు కన్నుమూత..

కానీ కొంతమంది దానిపై కోపం వ్యక్తం చేశారు.ఈ యువకులను చాలా తిట్టారు.

Advertisement

వీళ్ళు చాలా అజాగ్రత్తగా ఉన్నారని, ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయకూడదని అన్నారు.కొంతమంది ఈ యువకులను ఇలా బాధ్యతారాహిత్యంగా పెంచిన తల్లిదండ్రులను కూడా తిట్టారు.

తాజా వార్తలు