ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, పద్మవిభూషణ్ రామోజీరావు( Padmavibhushan Ramoji Rao ) మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు ఆయన మృతిపై వెంకయ్యనాయుడు, చంద్రబాబు, చిరంజీవి( Venkaiah Naidu, Chandrababu, Chiranjeevi ) సంతాపం తెలిపారు.
ఈ క్రమంలోనే రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి చెందారు.రామోజీరావు తెలుగు వెలుగు అన్న చంద్రబాబు ఆయన మృతి తీరని లోటని చెప్పారు.
సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారని పేర్కొన్నారు.రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని తెలిపారు.
అక్షర యోధుడుగా పేరున్న రామోజీరావు సేవలు ఎనలేనివని కొనియాడారు.ఇక ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగిందంటూ చిరంజీవి ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.
.