పని చేయకుండా లక్షల్లో సంపాదిస్తున్న వ్యక్తి.. ఎలా అంటే?

ఈ ప్రపంచంలో సాధారణంగా ఉద్యోగాలు అంటే ఒకటి కష్టపడి పని చేయడం, లేదా ఏదైనా నైపుణ్యం అవసరం ఉండే ఉద్యోగాలు.

కానీ, కొంతమంది వ్యక్తులు సంప్రదాయ ఉద్యోగాలకతీతంగా భిన్నమైన, వినూత్నమైన వృత్తులను ఎంచుకుని ఆశ్చర్యపరిచేలా సంపాదిస్తున్నారు.

అటువంటి వింత ఉద్యోగాల్లో ఒకటి “సెల్ఫ్ రెంటల్” బిజినెస్(“Self Rental” Business).వినడానికి విచిత్రంగా ఉన్నా, జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ వృత్తిలో ఏ పని చేయకుండానే లక్షల్లో సంపాదిస్తున్నాడు.జపాన్‌కు(Japan) చెందిన షోజి మోరిమోటో (Shoji Morimoto) అనే 41 ఏళ్ల వ్యక్తి ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఏదైనా ఉత్పత్తి లేకుండా భారీగా సంపాదిస్తున్నాడు.2018లో తను ఉద్యోగం కోల్పోయాడు.ఆ తర్వాత ఉద్యోగం దొరకకపోవటంతో కొత్తగా ఒక వినూత్న ఐడియాతో తనను తాను అద్దెకు ఇచ్చుకునే బిజినెస్(Business) ప్రారంభించాడు.

అంటే.ఎవరికైనా ఒంటరితనం అనిపించినా, ఎవరైనా తనతో కలిసి బయటకు వెళ్లాలనుకున్నా, ఎవరైనా తోడుగా ఉండాలనుకున్నా, తమ తరపున ఏదైనా చిన్న పనులు చేయించుకోవాలనుకున్నా వారు షోజిని అద్దెకు తీసుకోవచ్చు.

ఇది పూర్తిగా సాంఘిక సంబంధాలకే పరిమితమైన ఒక సర్వీస్.

A Person Who Earns Millions Without Working.. What Does That Mean, Unique Jobs,
Advertisement
A Person Who Earns Millions Without Working.. What Does That Mean?, Unique Jobs,

షోజిని హైరింగ్ చేసుకునే కస్టమర్లు అతనిని వివిధ రకాల పనులకు బుక్ చేసుకుంటారు.అందులో ఒంటరితనం అనిపించిన వారికి తోడుగా ఉండడం, మనతో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే తోడుగా వెళ్లడం, క్లయింట్స్ తరపున లైన్లలో నిలబడడం, వారితో సరదాగా ముచ్చటించడం, వారితో కలిసి భోజనం చేయడం, ఇలా విభిన్నమైన అవసరాలకు షోజిని హైరింగ్ చేసుకుంటారు.

A Person Who Earns Millions Without Working.. What Does That Mean, Unique Jobs,

షోజికి ప్రతిరోజూ 1000 మందికి పైగా అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్ వస్తుంటాయి.అంటే అతను నిర్వహిస్తున్న ఈ "సెల్ఫ్ రెంటల్"(Self Rental) సర్వీస్‌కు ఎంతటి డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.ఒక్క సెషన్‌కు 65 నుంచి 195 డాలర్లు వరకు ఛార్జ్ చేస్తాడు.

ఈ వినూత్నమైన వ్యాపారంతో షోజి ఏటా 80,000 డాలర్ల పైగా సంపాదిస్తున్నాడు అంటే నమ్మండి.ఏ పని చేయకుండానే, ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఇలా లక్షల్లో సంపాదిస్తున్న ఈ వ్యక్తి గురించి తెలుసుకున్న తర్వాత అందరికీ ఆశ్చర్యమే.

5-స్టార్ హోటల్‌లో ఫ్రీగా బ్రేక్‌ఫాస్ట్ చేసి తప్పించుకోవాలనుకున్న యువతి.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే షాక్!
Advertisement

తాజా వార్తలు