ఒంటరిగా విమానంలో 4000 కి.మీ. ప్రయాణించిన వ్యక్తి.. ఎందుకంటే..?!

విమానంలో ఒకే ఒక వ్యక్తి ప్రయాణించాడు.ఇది మామూలు విషయం కాదు.

 A Person, Traveled, 4000 Kilometers , Alone , Plane, Viral News, Viral Latest,so-TeluguStop.com

అతడు ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందో తెలిస్తే మీరు కూడా ఫీలవుతారు.ఎల్ అల్ అనే ఎయిర్‌‌లైన్ సంస్థ టెల్ అవీవ్ నుంచి కాసాబ్లాంకాకు ఒకే ఒక ప్రయాణికుడిని తీసుకెళ్లింది.

మొత్తం రెండు క్లాసుల్లో 160 మంది ప్రయాణికులు కూర్చోడానికి వీలున్న ఆ విమానంలో కేవలం ఒకరిని మాత్రమే తీసుకెళ్లడానికి గల కారణాన్ని కూడా ఆ విమానయాన సంస్థ వెల్లడించింది.మెడికల్ ట్రీట్మెంట్ అందించేందుకు ఆ వ్యక్తిని నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని మొరాకో నుంచి ఇజ్రాయెల్‌కు తీసుకొచ్చినట్లు పేర్కొంది.

స్థానిక ఏవియేషన్ రిపోర్టర్ బ్లుమెంటాల్ ఈ విషయాన్ని ట్వీట్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు.ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ప్రత్యేక విమానంలో తీసుకెళ్లాలి.

అంతేగానీ ప్రయాణికుల విమానాన్ని ఒకరి కోసమే వినియోగించడం ఏమిటని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.ఆ వ్యక్తి ఇజ్రాయెల్‌కు చెందిన పెద్ద వాణిజ్యవేత్త అని, అందుకే విమానాయాన సంస్థ అంత ఉత్సాహం చూపిందన్నారు.

మెడికల్ ఎమర్జెన్సీ కోసమైతే అతడితో వైద్యులు ఎందుకులేరనే ప్రశ్నలు కూడా తలెత్తాయి.అయితే, ఈ విమానాన్ని మాడిస్సిస్ మెడికల్ ఫ్లైట్స్ ఆధ్వర్యంలో ఈ విమానాన్ని మొరాకో పంపినట్లు తెలిసింది.

ఇందుకు ఆ ప్రయాణికుడు భారీ మొత్తమే చెల్లించినట్లు సమాచారం.మొత్తం 4000 కిలోమీట‌ర్ల దూరం అత‌ను విమానంలో ఒంటరిగా ప్ర‌యాణించాడు.

అత‌ను ఓ వ్యాపార‌వేత్త‌.త‌న చికిత్స కోసం అత‌ను ఏకంగా ఓ విమానాన్నే బుక్ చేసుకున్నాడు.

అందుక‌నే అందులో ఒంట‌రిగా ప్ర‌యాణించాడు.రాను, పోను ఖ‌ర్చుల‌న్నీ అత‌ను చెల్లించాడు.

మొద‌ట ప్ర‌యాణం 6 గంట‌లు ప‌డితే తిరుగు ప్ర‌యాణం 5 గంట‌లే ప‌ట్టింది.అయితే అత‌ను ఒక్కడే అలా విమానంలో ప్ర‌యాణించ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది.

అస‌లు విష‌యం తెలిసి అంతేనా అని నెటిజ‌న్లు ఫీల‌య్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube