పంచాయతీ ఎన్నికల అధికారుల బదిలీలో ఊహించని మలుపు

నిన్నటి వరకు నిమ్మగడ్డ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరిపై ఒక్కరు విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఏ‌పి పంచాయతీ ఎన్నికల రగడ సుప్రీం కోర్టు వరకు వెళ్లడంతో ఆ విషయంను కాస్త కోర్టు సీరియస్ గా తీసుకొని ఎస్‌ఈ‌సి కి అనుకూలంగా తీర్పును ఇచ్చింది.

కోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతుంది.కానీ పరిస్థితి ఇప్పుడు చేయి దాటి పోయింది.

అందుకే ఎన్నికలకు సిద్దం అవ్వుతుంది.రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల కు సంబందించిన రీ షెడ్యూల్ చేసింది.

పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ దివ్వేది, పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజ శంకర్ లను నిమ్మగడ్డ బదిలీ చేశాడు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంకు ఉత్తర్వులు కూడా జారీ చేశాడు.

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్‌ఈ‌సి ప్రకారం వాళ్ళను బదిలి చేసింది.ఇప్పుడు ఎస్‌ఈ‌సి, ఆ బదిలి విషయంను వెనక్కి తీసుకోవాలని చూస్తుంది.

ఎందుకు అంటే ఇప్పుడు వారి స్థానంలో కొత్తవారిని తీసుకుంటే వారు ఎన్నికల ప్రణాళికను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టేలాగా ఉంది.అందుకే తన ప్రతి పాదనను వెనక్కి తీసుకోవాలని చూస్తుంది.

రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఎన్నికల రీ షెడ్యూల్ ను చేసింది.ఈ నేపథ్యంలో బదిలి చేసినవారని మరల వెనక్కి తీసుకోవాలని అనుకుంటుండంపై సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయంపై పంచాయతీ రాజ్ మంత్రి పెద్ది రెడ్డి స్పందించాడు.ఎస్‌ఈ‌సి ఎంతమందిని బదిలి చేసుకుంటుందో చేసుకోమను మేము మాత్రం పట్టించుకోము అన్నాడు.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి
Advertisement

తాజా వార్తలు